నటి మూర్ స్విమ్మింగ్ పూల్ లో యువకుడి మృతదేహం | Man Found Dead in Demi Moore's Swimming Pool, Say Reports | Sakshi
Sakshi News home page

నటి మూర్ స్విమ్మింగ్ పూల్ లో యువకుడి మృతదేహం

Jul 20 2015 10:03 AM | Updated on Apr 4 2019 3:25 PM

నటి డెమీ మూర్ - Sakshi

నటి డెమీ మూర్

అమెరికన్ నటి డెమీ మూర్ స్మిమ్మింగ్ పూల్ లో ఓ వ్యక్తి మృతదేహం లభించింది.

లాస్ ఏంజిల్స్:అమెరికన్ నటి డెమీ మూర్ స్విమ్మింగ్ పూల్ లో ఆదివారం ఓ యువకుడు మృతదేహం లభించింది. 21 సంవత్సరాల వయస్సున్న ఆ యువకుడు అనుమానాస్పద రీతిలో నటి మూర్  స్విమ్మింగ్ పూల్ లో పడి మృతిచెందాడు.

 

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.  కాగా, ఆ సమయంలో డెమీ మూర్ ఇంట్లో లేనట్లు లాస్ ఏంజిల్స్ లోని  టైమ్స్ పత్రిక తెలిపింది. అతను స్విమ్మింగ్ చేద్దామని భావించి స్విమ్మింగ్ పూల్ లో దిగి ఈత రాక చనిపోయి ఉండవచ్చని..   ఒకవేళ కాని పక్షంలో ఏదైనా రోగంతో స్విమ్మింగ్ పూల్ లోకి  జారిపడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement