సంపులో పడి వ్యక్తి మృతి | Man dies to dump in Sump | Sakshi
Sakshi News home page

సంపులో పడి వ్యక్తి మృతి

Sep 6 2015 2:14 PM | Updated on Mar 28 2018 11:11 AM

సంపులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది.

ఘట్‌కేసర్(రంగారెడ్డి): సంపులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. పట్టణంలోని బాలాజీ నగర్‌లో నివాసముండే ప్రసాద్(30) ఓ కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు. అయితే ఈ రోజు తాను అద్దెకు ఉండే ఇంట్లోని సంపులో పడి మృతి చెందాడు. మృతుడి స్వస్థలం అనంతపురం జిల్లా తాడిపత్రిగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement