breaking news
Tadipatri police
-
ఎట్టకేలకు న్యాయం గెలిచింది.. ‘సుప్రీం’ తీర్పుపై పెద్దారెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ/అనంతపురం: వైఎస్సార్సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి భారీ ఊరట(Big Relief For Kethireddy Pedda Reddy) లభించింది. నియోజకవర్గంలో అనుమతి పెట్టేందుకు ఆయనకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలోకి నిరభ్యంతరంగా వెళ్లొచ్చని సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది.తాడిపత్రిలోకి తనను అనుమతించడం లేదంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. తన సొంత నియోజకవర్గంలోకి అనుమతించకుండా టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ పిటిషన్లో పేర్కొన్నారాయన. ఈ పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. ‘‘మీ నియోజకవర్గంలోకి వెళ్లకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతారు?’’ అంటూ పెద్దారెడ్డిని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ.. తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి అవసరమైన భద్రత కల్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఒకవేళ అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పెట్టుకోవచ్చని పెద్దారెడ్డికి కోర్టు సూచించింది. ఈ క్రమంలో.. పోలీసు సెక్యూరిటీ అవసరమైన ఖర్చు భరించేందుకు పెద్దారెడ్డి తరపు న్యాయవాదులు అంగీకరించారు.14 నెలలుగా దూరంఏపీలో కిందటి ఏడాది అసెంబ్లీ ఎన్నికల వేళ.. తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలింగ్ తర్వాత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసి టీడీపీ జెండా ఎగరేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి అంటే దాదాపు 14 నెలలుగా.. ఆయన తాడిపత్రిలో అడుగుపెట్టలేకపోతున్నారు.తాడిపత్రి వెళ్లాలనుకున్న ప్రతీసారి పోలీసులు పెద్దారెడ్డిని అడ్డుకుంటూ వస్తున్నారు. జేసీ ఒత్తిళ్ల వల్లే పోలీసులు తనను అడ్డుకుంటున్నారని పెద్దారెడ్డి, ఇటు వైఎస్సార్సీపీ విమర్శిస్తూ వస్తోంది. ఈ క్రమంలో.. హైకోర్టులో పెద్దారెడ్డికి భారీ ఊరట లభించింది. తాడిపత్రికి వెళ్లేందుకు నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ పోలీసులు ఆయనకు సహకరించకుండా వచ్చారు.దీంతో పెద్దారెడ్డి హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు పోలీసుల నుంచి వివరణ కోరింది. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే పెద్దారెడ్డిని రానివ్వడం లేదని అనంత ఎస్పీ పిటిషన్ వివరణ ఇచ్చుకున్నారు. దీంతో.. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన అనుమతిని ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. పెద్దారెడ్డి తాడిపత్రి అనుమతిని రద్దు చేస్తూ విచారణ వాయిదా వేసింది. ఈ పిటిషన్ విచారణలో ఉండగానే.. ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించి ఇప్పుడు ఊరట దక్కించుకున్నారు. పెద్దారెడ్డి రియాక్షన్సుప్రీం కోర్టు తీర్పుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘‘నేను తాడిపత్రి వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో న్యాయం గెలిచింది. సుప్రీంకోర్టు తీర్పు కాపీలను ఎస్పీ కి అందజేస్తా.. త్వరలో తాడిపత్రి వెళ్తాను. తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా.. సేవ చేస్తా. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు పోలీసులకు సహకరిస్తాను అని అన్నారాయన. -
పోలీసులపై జేసీ ప్రభాకర్‌రెడ్డి జులుం
తాడిపత్రి: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై జులుం ప్రదర్శించారు. ఆగ్రహంతో ఊగిపోతూ చిందులు తొక్కారు. టీడీపీ తాడిపత్రి నియోజకవర్గ ఇన్చార్జి, ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి శనివారం సాయంత్రం పట్టణంలోని ఒకటో వార్డులో పర్యటించేందుకు నివాసం నుంచి బయల్దేరారు. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ముందస్తు అనుమతి లేనిదే వార్డుల్లో పర్యటించకూడదని పోలీసులు ఆయన్ను ఒకటో వార్డు గాందీనగర్ వద్ద అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి అక్కడికి చేరుకుని పోలీసులపై చిందులు తొక్కారు. డీఎస్పీ వీఎన్కే చైతన్య జోక్యం చేసుకుని.. శాంతిభద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించబోమని, నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయని స్పష్టంచేశారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డిని పంపించివేశారు. ఇదీ చదవండి: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో రంగంలోకి సీబీఐ.. నాగాలాండ్‌లో అక్రమ రిజిస్ట్రేషన్లు -
మళ్లీ జైలుకు జేసీ..
తాడిపత్రి/కడప అర్బన్ /అనంతపురం క్రైం: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మళ్లీ జైలుపాలయ్యారు. తాడిపత్రి సీఐ దేవేంద్రను కులం పేరుతో దూషించడంతో పాటు కరోనా నిబంధనల ఉల్లంఘన, అధికారులకు బెదిరింపులకు సంబంధించి ఆయనపై తాడిపత్రి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటితో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. జేసీ బెయిల్‌పై గురువారం విడుదలయ్యాక కడప కారాగారం వద్ద కరోనా నిబంధనలను ఉల్లంఘించారు. దీంతో ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి, జేసీ పవన్కుమార్రెడ్డిలతోపాటు 31 మందిపై రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే జేసీ భారీ కాన్వాయ్‌తో తాడిపత్రి వస్తూ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న సీఐ దేవేంద్రను కులం పేరుతో దూషించారు. దీంతో శుక్రవారం అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు సంతకాలు చేసేందుకు వచ్చిన జేసీని తాడిపత్రి డీఎస్పీ అరెస్ట్ చేశారు. గుత్తి మేజిస్ట్రేట్లో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం జేసీని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. -
ఏపీలో మరో అధికారి బదిలీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ అధికారులపై చర్యలు కొనసాగుతున్నాయి. తాజాపై మరో సీఐపై బదిలీ వేటు పడింది. అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ సీఐ నారాయణరెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయన స్థానంలో శరత్ చంద్రను తాడిపత్రి సీఐగా నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశాలిచ్చారు. ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించడం లేదన్న ఆరోపణలతో చిత్తూరు జిల్లా మదనపల్లి రెండో పట్టణ సీఐ సురేశ్‌కుమార్‌పై ఇప్పటికే బదిలీ వేటు పడింది. అధికార టీడీపీ ఎన్నికల ప్రచార సభలో కోడ్ ఉల్లంఘన జరిగిన విషయాన్ని రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు నవీన్‌కుమార్ గుర్తించి కేసు నమోదు చేయమని చెప్పినా సురేశ్‌కుమార్ పెడచెవిన పెట్టారు. ఏకపక్షంగా వ్యవహరించిన సురేశ్‌ను ఎన్నికల విధుల నుంచి ఆయన స్థానంలో అనంతపురం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో సీఐగా పనిచేస్తున్న పి. సుబ్బారాయుడును నియమిస్తూ గోపాలకృష్ణ ద్వివేది ఆదేశాలిచ్చారు. (చదవండి: తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌కు ఎదురుదెబ్బ) -
ఆశ్రమంలోకి అనుమంతించకపోతే..
సాక్షి, తాడిపత్రి : ప్రబోధానందస్వామి భక్తులకు, తాడిపత్రి పోలీసులకు మధ్య వివాదం నెలకొంది. ఆశ్రమంలోకి పోలీసులు తమను అనుమతించడంలేదంటూ జయలక్ష్మీ, భూలక్ష్మీ అనే మహిళా భక్తులు మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్రమంలోకి అనుమతించకుండా పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారనీ, మనోభావాలను కించపరిచేలా మాట్లాడుతున్నారని వాపోయారు. ఆధార్ కార్టులు చూపినా ఆశ్రమంలోకి ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు. ఆశ్రమంలోని తమ గదులను కూడా పోలీసులు ఆక్రమించారని అన్నారు. ‘ప్రబోధానంద ఆశ్రమంలో దేవుడు లేడు’ అంటూ హేళనగా మాట్లాడుతున్నారనీ, తమ సెంటిమెంట్లను అగౌరపరుస్తున్నారని ఆరోపించారు. ఆశ్రమంలోకి అనుమంతించకపోతే తమకు చావే శరణ్యమని అన్నారు. -
సంపులో పడి వ్యక్తి మృతి
ఘట్కేసర్(రంగారెడ్డి): సంపులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. పట్టణంలోని బాలాజీ నగర్లో నివాసముండే ప్రసాద్(30) ఓ కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు. అయితే ఈ రోజు తాను అద్దెకు ఉండే ఇంట్లోని సంపులో పడి మృతి చెందాడు. మృతుడి స్వస్థలం అనంతపురం జిల్లా తాడిపత్రిగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. -
సాధిక్ హత్య ... కాంట్రాక్ట్ మర్డర్
అనంతపురం: తాడిపత్రి టీడీపీ కౌన్సిలర్ సాదిఖ్ హత్య కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి రౌడీ షీటర్ జావెద్‌తో సహా 8 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. వారి వద్ద నుంచి మూడు వేట కొడవళ్లు, రెండు పిడిబాకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని వారు పేర్కొన్నారు. సాధిక్ హత్య కాంట్రాక్ట్ మర్డర్ అని పోలీసులు చెప్పారు. అక్టోబర్ 23వ తేదీన తాడిపత్రిలో సాధిక్‌పై కొంత మంది ఆగంతకులు దాడి చేసి వేటకొడవళ్లుతో నరికారు. దీంతో అతడు రక్తపుమడుగులో కుప్పకూలిపోయాడు. అనంతరం ఆగంతకులు అక్కడి నుంచి పరారైయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన సాధిక్‌ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాధిక్ మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులోభాగంగా ఈ హత్యలో ప్రమేయం ఉన్నవారిని పోలీసులు అరెస్ట్ చేశారు.