
క్షమాపణ చెప్పిన మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పారిశ్రామిక వేత్తలకు క్షమాపణ చెప్పారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పారిశ్రామిక వేత్తలకు క్షమాపణ చెప్పారు. వామపక్ష ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక దుర్నిర్వహణకు తాను క్షమాపణ అడుగుతున్నానని అన్నారు. ఇకనైనా తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు.
'గతంలో జరిగిన వాటిని మర్చిపోండి. గతంలో జరిగిన దానికి నేను క్షమాపణ చెబుతున్నాను. అప్పుడు జరిగిన చెడును వదిలేద్దాం. ఈరోజు గురించి ఆలోచిద్దాం. రేపటి కోసం పనిచేద్దాం' అని మమతా అన్నారు. కోల్కతాలో రెండు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ వాణిజ్య సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.