ప్రేమజంట ఆత్మహత్యాయత్నం | Love fair attempt to suicide | Sakshi
Sakshi News home page

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

Sep 15 2015 12:24 AM | Updated on Apr 7 2019 3:35 PM

తమ ప్రేమను కుటుంబసభ్యులు అంగిక రించరనే భయంతో ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.

సాలూరు(విజయనగరం): తమ ప్రేమను కుటుంబసభ్యులు అంగిక రించరనే భయంతో ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఇది గుర్తించిన కుటుంబసభ్యులు వారిని ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ సంఘటన విజయనగరం జిల్లా సాలూరులోని కర్రివీధిలో సోమవారం రాత్రి జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన బుల్లిపల్లి రాములు(21) లారీ క్లీనర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో వృత్తి విద్యా కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న అదే కాలనీకి చెందిన చౌడిపల్లి జ్యోతి(16)ని ప్రేమించాడు. దీనికి ఆ అమ్మాయి కూడా అంగీకరించడంతో.. వారి జీవనం సాఫీగా సాగిపోతుండగా.. ఈ విషయాన్ని ఇంట్లో చెప్తే ఏమంటారో అనే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమికులిద్దరూ ఈ రోజు రాత్రి ఎవరి ఇంట్లో వాళ్లు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా.. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement