'ప్రతీది ట్యాక్స్ టెర్రరిజం కాదు'
జీఎస్టీ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ బిల్లును వ్యతిరేకిస్తుందని చెప్పారు.
న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ బిల్లును వ్యతిరేకిస్తుందని చెప్పారు. బుధవారం ఆయన భారత శిఖరాగ్ర సమావేశంలో పలు అంశాలపై ప్రత్యేకంగా మాట్లాడారు. 2016 ఏప్రిల్ నెలలోగానైనా జీఎస్టీ బిల్లును ఆమోదింపజేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక సంక్షోభం కొట్టుమిట్టాడుతున్న భారత్ మాత్రం అత్యధిక అభివృద్ధిని నమోదు చేస్తుందని చెప్పారు. జైట్లీ ఇంకేం చెప్పారంటే..
*నల్లధనం విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అంత తేలిగ్గా తీసుకోవడం లేదు.
*నల్లధనం తిరిగి వెనుకకు తీసుకురావడం భారత్ హక్కు.
*దేశియ ఉక్కు రంగాన్ని పరిరక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తున్నాము. ఇందుకోసం విదేశాలనుంచి దిగుమతి అయ్యే ఉక్కు సంబంధ వస్తువుల నాణ్యత పరిశీలన స్థాయిని పెంచుతాం. అదే సమయంలో భారత్ నుంచి ఎగుమతుల స్థాయిని పెంచుతాం
*వచ్చే నాలుగేళ్లలో కార్పొరేట్ ట్యాక్స్ 25శాతానికి తగ్గించే చర్యలో భాగంగా త్వరలోనే పన్ను మినహాయింపు అంశాల జాబితా తీసుకొస్తాం.
*ప్రతి ట్యాక్స్ డిమాండ్ను 'ట్యాక్స్ టెర్రరిజం'గా చూడవద్దు.
*బలహీనంగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసి మరోసారి వాటికి శక్తినిస్తాం.
*బ్యాంకు రంగంలో నాన్ ఫర్ఫామింగ్ అస్సెట్స్(ఎన్పీఏ) ప్రస్తుత ఆందోళనకు కారణం.. అయితే, దీనిగురించి పెద్దగా భయపడాల్సిన పనిలేదు.
*ఇరు వర్గాలకు లబ్ధి చేకూర్చేలా వ్యాపార రంగాన్ని వృద్ధి చేయాలని భావిస్తున్నాం. పెట్టుబడిదారులకు, వ్యాపారులకు నష్టం జరగకూడదన్నదే మా భావన.
*జీవీకే బయోసైన్సెస్ పరీక్షల చేసిన తర్వాత కూడా 700 ఫార్మా ఉత్పత్తులను ఈయూ నిషేధించడం కొంత ఆందోళనగా ఉంది. అయితే, ఈయూతో స్వేచ్ఛా వ్యాపారం చేసేందుకు ఇప్పటికే మాట్లాడాం.


