breaking news
India Summit 2015
-
లలిత.. రాహుల్ రైడర్!
సాక్షి, హైదరాబాద్: భారత్ సమ్మిట్‌లో భాగంగా శనివారం తెలంగాణ గిగ్ వర్కర్స్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ స్కీమ్‌ను ప్రారంభించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఆయన నగరానికి చెందిన గిగ్ వర్కర్ లలిత బైక్‌కు పిలియన్ రైడర్‌గా మారారు. రాహుల్‌ను తన వాహనం ఎక్కించుకుని రైడ్ చేసిన లలిత ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పగిడాల మండలానికి చెందిన యువతి. ఆమె ర్యాపిడోలో పింక్ బైక్‌కు ఫిమేల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ర్యాలీ నేపథ్యంలో తనకు అనుకోకుండా వచ్చిన అవకాశానికి సంబంధించిన అనుభవాన్ని ఆమె మీడియాతో పంచుకున్నారు. ‘వృత్తిరీత్యా స్టాఫ్‌నర్సు. పార్ట్‌టైమ్‌గా పింక్ బైక్ రైడ్ చేస్తున్నా. తండ్రి చిన్నతనంలోనే చనిపోగా... తల్లి, సోదరుడు ఉన్నారు. నాకు తొలుత డ్రైవింగ్ రాదు. స్కూటీ కొన్నాకే నేర్చుకున్నా. స్కూటీ కొంటా అన్నప్పుడు ఇంట్లో వాళ్లు తిట్టారు. హైదరాబాద్‌లో చాలా ట్రాఫిక్ ఉంటుంది. నువ్వో విలేజ్ అమ్మాయివి అన్నారు. తర్వాత నెమ్మదిగా వాళ్లు అర్థం చేసుకున్నారు. గిగ్ వర్కర్‌గా చేస్తున్నానని ఇప్పటివరకు వారికి చెప్పలేదు. నాకు శుక్రవారం ర్యాపిడో నుంచి ఓ కాల్ వచ్చింది. రాహుల్ గాం«దీని కలవాలంటే అవకాశం ఉందని, నీకు ఆసక్తి ఉందా అని అడిగారు..? ఉందని సమాధానం చెప్పా. అప్పుడు ఎక్కడో దూరం నుంచి చాలామంది మధ్యలో ఉండి రాహుల్ గాంధీని చూస్తానని అనుకున్నా. కానీ ఇలా ఆయన్ను నా స్కూటీ వెనుక ఎక్కించుకుని డ్రైవ్ చేస్తానని అనుకోలేదు. ర్యాలీ ప్రారంభానికి ముందు రాహుల్ నా దగ్గరకు వచ్చి ‘హాయ్ నైస్ టు మీట్ యు.. హౌ ఆర్ యూ’అన్నారు.. ‘ఫైన్ సార్.. ఆప్ కైసేహై’అని అన్నా. తర్వాత నా బైక్ వెనుక కూర్చుని ‘చలో’అన్నారు. దారిలో ‘స్లో... స్లో’అని.. ఓ చోట మాత్రం వేగం పెంచమంటూ ‘మూవ్’అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. రాహుల్‌ను ఎక్కించుకుని, సీఎం పక్క, పోలీసుల మధ్య డ్రైవ్ చేస్తుంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యా’అని లలిత చెప్పారు. -
'ప్రతీది ట్యాక్స్ టెర్రరిజం కాదు'
న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ బిల్లును వ్యతిరేకిస్తుందని చెప్పారు. బుధవారం ఆయన భారత శిఖరాగ్ర సమావేశంలో పలు అంశాలపై ప్రత్యేకంగా మాట్లాడారు. 2016 ఏప్రిల్ నెలలోగానైనా జీఎస్టీ బిల్లును ఆమోదింపజేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక సంక్షోభం కొట్టుమిట్టాడుతున్న భారత్ మాత్రం అత్యధిక అభివృద్ధిని నమోదు చేస్తుందని చెప్పారు. జైట్లీ ఇంకేం చెప్పారంటే.. *నల్లధనం విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అంత తేలిగ్గా తీసుకోవడం లేదు. *నల్లధనం తిరిగి వెనుకకు తీసుకురావడం భారత్ హక్కు. *దేశియ ఉక్కు రంగాన్ని పరిరక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తున్నాము. ఇందుకోసం విదేశాలనుంచి దిగుమతి అయ్యే ఉక్కు సంబంధ వస్తువుల నాణ్యత పరిశీలన స్థాయిని పెంచుతాం. అదే సమయంలో భారత్ నుంచి ఎగుమతుల స్థాయిని పెంచుతాం *వచ్చే నాలుగేళ్లలో కార్పొరేట్ ట్యాక్స్ 25శాతానికి తగ్గించే చర్యలో భాగంగా త్వరలోనే పన్ను మినహాయింపు అంశాల జాబితా తీసుకొస్తాం. *ప్రతి ట్యాక్స్ డిమాండ్‌ను 'ట్యాక్స్ టెర్రరిజం'గా చూడవద్దు. *బలహీనంగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసి మరోసారి వాటికి శక్తినిస్తాం. *బ్యాంకు రంగంలో నాన్ ఫర్ఫామింగ్ అస్సెట్స్(ఎన్పీఏ) ప్రస్తుత ఆందోళనకు కారణం.. అయితే, దీనిగురించి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. *ఇరు వర్గాలకు లబ్ధి చేకూర్చేలా వ్యాపార రంగాన్ని వృద్ధి చేయాలని భావిస్తున్నాం. పెట్టుబడిదారులకు, వ్యాపారులకు నష్టం జరగకూడదన్నదే మా భావన. *జీవీకే బయోసైన్సెస్ పరీక్షల చేసిన తర్వాత కూడా 700 ఫార్మా ఉత్పత్తులను ఈయూ నిషేధించడం కొంత ఆందోళనగా ఉంది. అయితే, ఈయూతో స్వేచ్ఛా వ్యాపారం చేసేందుకు ఇప్పటికే మాట్లాడాం.


