ప్రఖ్యాత న్యాయశాస్త్ర కోవిదుడు, కమ్యూనిస్టు యోధుడు వి.ఆర్. కృష్ణయ్యర్ అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి.
కొచ్చి: ప్రఖ్యాత న్యాయశాస్త్ర కోవిదుడు, కమ్యూనిస్టు యోధుడు వి.ఆర్. కృష్ణయ్యర్ అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి. కేరళ ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆయన ఇద్దరు కుమారులు కర్మకాండ నిర్వహించారు. తర్వాత శవదహనశాలలో ఆయన భౌతికకాయాన్ని దహనం చేశారు.
కేరళ మంత్రి కే బాబు ప్రభుత్వ ప్రతినిధిగా అంత్యక్రియలకు హాజరయ్యారు. అంతకుముందు కృష్ణయ్యర్ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి ఒమన్ చాంది, మంత్రులు కేఎం మణి, కే బాబు, కేపీ మోహనన్, ప్రతిపక్ష నేత అచ్యుతానందన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పి. రవీంద్రన్, క్రైస్తవ మత పెద్దలు శ్రద్ధాంజలి ఘటించారు.