ఫర్బిడెన్ సిటీని సందర్శించిన కేసీఆర్ | kcr visits beijing | Sakshi
Sakshi News home page

ఫర్బిడెన్ సిటీని సందర్శించిన కేసీఆర్

Sep 12 2015 3:48 PM | Updated on Aug 15 2018 9:30 PM

చైనాలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బీజింగ్లో చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శించారు.

బీజింగ్: చైనాలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బీజింగ్లో చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. బీజింగ్లోని ఫర్బిడెన్ సిటీని కేసీఆర్ బృందం సందర్శించింది.

చైనా పర్యటనలో భాగంగా శనివారం కేసీఆర్ తీరికలేకుండా గడిపారు. బీజింగ్‌లో పలు కంపెనీల ప్రతినిధులతో  కేసీఆర్‌ బృందం భేటీ అయింది. చైనా ఫార్చూన్‌ ల్యాండ్‌ డెవలప్మెంట్ కంపెనీ ప్రతినిధులను కలిశారు. తెలంగాణలో ఇండస్ట్రియల్ పార్క్ల అభివృద్ధికి ఫార్చూన్‌ ల్యాండ్‌ డెవలప్మెంట్ కంపెనీ ఆసక్తి కనబరిచింది.
 

Advertisement
 
Advertisement
Advertisement