హాంకాంగ్లో వ్యాపారవేత్తలతో కేసీఆర్ భేటీ | kcr meeting with businessmen in hong kong | Sakshi
Sakshi News home page

హాంకాంగ్లో వ్యాపారవేత్తలతో కేసీఆర్ భేటీ

Sep 15 2015 10:08 AM | Updated on Sep 2 2018 3:17 PM

హాంకాంగ్లో వ్యాపారవేత్తలతో కేసీఆర్ భేటీ - Sakshi

హాంకాంగ్లో వ్యాపారవేత్తలతో కేసీఆర్ భేటీ

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు సహకరించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాంకాంగ్లోని వాణిజ్య, వ్యాపారవేత్తలను కోరారు.

హాంకాంగ్ : తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు సహకరించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాంకాంగ్లోని వాణిజ్య, వ్యాపారవేత్తలను కోరారు. మంగళవారం హాంకాంగ్లో స్థానిక వాణిజ్య, వ్యాపారవేత్తలతో కేసీఆర్ భేటీ అయ్యారు. అయితే ఈ రోజు సాయంత్రం కేసీఆర్ బృందం  హాంకాంగ్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించనుంది. అలాగే హాంకాంగ్లోని భారత రాయబారి ఈ రోజు కేసీఆర్ బృందానికి విందు ఇవ్వనున్నారు. ఆ విందుకు కేసీఆర్ బృందం హాజరుకానుంది. చైనా, హాంకాంగ్లో సీఎం కేసీఆర్ బృందం పర్యటన నేటితో ముగియనుంది. రేపు కేసీఆర్ బృందం హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement