నగదుకోసం క్యూలో ఉంటే... | Kanpur: Woman delivers baby inside bank while waiting in queue to get cash | Sakshi
Sakshi News home page

నగదుకోసం క్యూలో ఉంటే...

Dec 3 2016 11:03 AM | Updated on Sep 4 2017 9:49 PM

నగదుకోసం క్యూలో  ఉంటే...

నగదుకోసం క్యూలో ఉంటే...

పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు విత్ డ్రా కోసం ఏర్పడుతున్న క్యూ లైన్లలో మరో ఆసక్తికర సంఘటన నమోదైంది. లక్ష్మికోసం క్యూ లో నిలుచుంటే.. అనూహ్యంగా శుక్రవారం పూట మరో లక్ష్మి వచ్చి పలకరించింది.

కాన్పూర్: పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు విత్ డ్రా కోసం ఏర్పడుతున్న క్యూ లైన్లలో మరో ఆసక్తికర సంఘటన నమోదైంది. డబ్బుల కోసం క్యూలో నిలుచుంటే.. అనూహ్యంగా  శుక్రవారం పూట లక్ష్మి వచ్చి పలకరించింది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ దేహత్ జిల్లాలో ఉత్తరప్రదేశ్ కాన్పూర్ దేహత్ జిల్లాలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో  ఈ సంఘటన చోటు  చేసుకుంది.


వివరాల్లోకి వెళితే...దేహత్  జిల్లాకు చెందిన సర్వేష (30) అత్తగారితో కలిసి నగదు విత్ డ్రా కోసం బ్యాంకు కు వెళ్లింది. గురువారం క్యూ లో నిలుచున్నా ఫలితం దక్కకపోవడంతో మళ్లీ శుక్రవారం ఉదయం నుంచి క్యూలో  వెయిట్ చేస్తోంది. ఇంతలో సుమారు నాలుగు గంటల ప్రాంతంలో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి.  ఆంబులెన్స్  రావడం ఆలస్యం కావడంతో అక్కడున్న మహిళలు ఆమెకు అండగా నిలిచారు. వారి సహాయంతో సర్వేష బ్యాంకులోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.  అనంతరం పోలీసులు తల్లీబిడ్డలను సమీపంలో ఆసుపత్రికి తరలించారు.

అయితే  తనకోడలు చాలా  బలహీనంగా ఉండడటంతో తనకు భయమేసిందని సర్వేష అత్తగారు  తెలిపింది. కానీ అందమైన  పుట్టడం సంతోషంగా ఉందనీ, ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారంటూ ఆనందం వ్యక్తం చేసింది. కాగా  ఈ ఏడాది సెప్టెంబర్ లో సర్వేష భర్త  అశ్వేంద్ర రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీనితో యూపీ ప్రభుత్వం  సుమారు రూ.2.75 లక్షలు, ఇల్లు పరిహారాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించి  ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తీసుకోవడకోసం అత్తతో కలిసి బ్యాంకుకు వెళ్లింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement