షూటింగ్‌ విషాదం... షాకింగ్‌ నిజాలు! | kannada movie helicopter stunt went wrong | Sakshi
Sakshi News home page

షూటింగ్‌ విషాదం... షాకింగ్‌ నిజాలు!

Nov 8 2016 6:08 PM | Updated on Apr 3 2019 7:53 PM

కన్నడ సినిమా ‘మాస్తీగుడి' క్లైమాక్స్‌ షూటింగ్‌లో భాగంగా హెలికాప్టర్‌ నుంచి రిజర్వాయర్‌లోకి దూకి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు నటుల మృతదేహాలు ఇంకా లభించలేదు.

కన్నడ సినిమా షూటింగ్‌లో భాగంగా హెలికాప్టర్‌ నుంచి రిజర్వాయర్‌లోకి దూకి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు నటుల మృతదేహాలు ఇంకా లభించలేదు. 30మందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం రిజర్వాయర్‌లో తీవ్రంగా గాలిస్తున్నా వారి ఆచూకీ లభించలేదు. ప్రముఖ హీరో ‘దునియా’ విజయ్ హీరోగా, అమూల్య హీరోయిన్‌గా నాగశేఖర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మాస్తీగుడి. బెంగళూరుకు 35 కిలోమీటర్ల దూరంలోని రామనగర జిల్లా తిప్పగుండనహళ్లి రిజర్వాయర్ వద్ద సోమవారం ఈ సినిమా పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవి ఏమిటంటే... 
 
  • షూటింగ్‌లో భాగంగా హెలికాప్టర్‌లో నుంచి రిజర్వాయర్‌లోకి దూకే సీన్‌ కోసం ఎలాంటి ముందుజాగ్రత్త భద్రత చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. హీరో దునియా విజయ్‌, విలన్‌ పాత్రలు పోషిస్తున్న ఉదయ్‌, అనిల్‌ ముగ్గురు నీటిలో దూకగా.. ఒక్క విజయ్‌ కోసమే భద్రత ఏర్పాట్లు చేశారని సమాచారం.
Advertisement
 
Advertisement
Advertisement