అఫ్ఘానిస్థాన్ లో న్యాయమూర్తి కాల్చివేత | Judge shot dead in Afghanistan | Sakshi
Sakshi News home page

అఫ్ఘానిస్థాన్ లో న్యాయమూర్తి కాల్చివేత

Nov 3 2014 3:35 PM | Updated on Sep 2 2017 3:49 PM

అఫ్ఘానిస్థాన్ లోని ఘోర్ ప్రావిన్స్ లో ఓ న్యాయమూర్తిని గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చిచంపారు.

కాబూల్: అఫ్ఘానిస్థాన్ లోని ఘోర్ ప్రావిన్స్ లో ఓ న్యాయమూర్తిని గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చిచంపారు. మృతుడు ఖాజీ అబ్దుల్ మాజిద్ గా గుర్తించారు. ప్రావిన్స్యల్ జ్యుడీషియల్ ప్యానల్ లో జడ్జిగా ఆయన పనిచేస్తున్నారు.

ఆదివారం రాత్రి ఇంటికి వెళుతున్న అబ్దుల్ మాజిద్ పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారని అఫ్ఘానిస్థాన్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement