రాజ్యసభ అభ్యర్థి మార్పు, పార్టీ నుంచి బహిష్కరణ | Jayalalithaa replaces AIADMK candidate for rajyasabha polls; expels him | Sakshi
Sakshi News home page

రాజ్యసభ అభ్యర్థి మార్పు, పార్టీ నుంచి బహిష్కరణ

Jan 25 2014 12:49 PM | Updated on Sep 2 2017 3:00 AM

రాజ్యసభ ఎన్నికలకు ముందుగా నిర్ణయించిన అభ్యర్థులలో ఒకరిని తప్పించిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత.. ఆ తీసేసిన అభ్యర్థిని పార్టీ నుంచి కూడా బహిష్కరించారు.

రాజ్యసభ ఎన్నికలకు ముందుగా నిర్ణయించిన అభ్యర్థులలో ఒకరిని తప్పించిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత.. ఆ తీసేసిన అభ్యర్థిని పార్టీ నుంచి కూడా బహిష్కరించారు. అతడి స్థానంలో వేరే అభ్యర్థిని కూడా ప్రకటించేశారు. ఎన్.చిన్నదురై పార్టీ నిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తుండగా, ఆయనను రాజ్యసభ సభ్యత్వానికి అభ్యర్థిగా ఎంపిక చేశారు.

అయితే.. ఆ తర్వాత చిన్నదురై పార్టీ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలియడంతో ఆయనను తప్పించి, ఆ స్థానంలో ఏకే సెల్వరాజ్ను ఆ స్థానంలో అభ్యర్థిగా ప్రకటించారు. చిన్నదురై పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని కూడా ఆమె అన్నారు. ఫిబ్రవరి ఏడో తేదీన జరిగే రాజ్యసభ ఎన్నికలలో సీపీఎం అభ్యర్థి టీకే రంగరాజన్కు కూడా అన్నాడీఎంకే మద్దతు ఇస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement