ఆయనను ఆహ్వానించడం దురదృష్టకరం | Jayalalithaa dubs invite to Lankan Prez as 'unfortunate' | Sakshi
Sakshi News home page

ఆయనను ఆహ్వానించడం దురదృష్టకరం

May 22 2014 7:16 PM | Updated on Aug 15 2018 2:30 PM

ఆయనను ఆహ్వానించడం దురదృష్టకరం - Sakshi

ఆయనను ఆహ్వానించడం దురదృష్టకరం

నరేంద్ర మోడీ తన ప్రమాణ స్వీకారానికి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సెను ఆహ్వానించడంపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అసంతృప్తి వ్యక్తం చేశారు.

చెన్నై: నరేంద్ర మోడీ తన ప్రమాణ స్వీకారానికి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సెను ఆహ్వానించడంపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తమిళుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామని మోడీ హామీయిచ్చిన నేపథ్యంలో రాజపక్సెను ఆహ్వానించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం దురదృష్టకరమన్నారు.

శ్రీలంక అధ్యక్షుడికి ఆహ్వానంపై కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే కూడా అభ్యతంరం తెలిపింది. తమిళుల మనోభావాలను మోడీ అర్థం చేసుకోవాలని సూచించింది. శ్రీలంకలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనపై తమిళులు ఆగ్రహంగా ఉన్నారని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement