డివైడ్ టాక్ వచ్చినా.. భారీ వసూళ్లు! | Jakkanna a profitable venture, says Trade analyst | Sakshi
Sakshi News home page

డివైడ్ టాక్ వచ్చినా.. భారీ వసూళ్లు!

Aug 13 2016 3:03 PM | Updated on Sep 4 2017 9:08 AM

డివైడ్ టాక్ వచ్చినా.. భారీ వసూళ్లు!

డివైడ్ టాక్ వచ్చినా.. భారీ వసూళ్లు!

చాలాకాలంగా హిట్‌ సినిమా లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న హీరో సునీల్‌కు 'జక్కన్న' కొత్త ఊపిరి ఇచ్చిందని చెప్పొచ్చు.

చెన్నై: చాలాకాలంగా హిట్‌ సినిమా లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న హీరో సునీల్‌కు 'జక్కన్న' కొత్త ఊపిరి ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ సినిమాకు నెగిటివ్‌ టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం చెప్పుకోదగినస్థాయిలో సాధించింది. 'జక్కన్న' సినిమా రెండువారాల్లోనే రూ. 16 కోట్లు వసూలుచేసిందని టాలీవుడ్‌ ట్రేడ్ విశ్లేషకుడు త్రినాథ్ తెలిపారు.

'సునీల్‌కు 'జక్కన్న' ఊరటనిచ్చింది. ఈ సినిమా నిర్మాతకు లాభదాయకంగా నిలిచింది. రెండువారాల్లోనే 'జక్కన్న' బాక్సాఫీస్ వద్ద రూ. 16కోట్లు వసూలు చేశాడు. దీంతో హిట్‌ కోసం సునీల్ ఎదురుచూపులు ఫలించాయనే చెప్పొచ్చు' అని త్రినాథ్ ఐఏఎన్‌ఎస్‌కు చెప్పారు.

వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో సునీల్, మన్నారా చోప్రా జోడీగా 'జక్కన్న' ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టడంపై నిర్మాత సుదర్శన్‌ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

'సినిమాకు మొదటిరోజు డివైడ్ టాక్ వచ్చింది. కానీ రెండోరోజు నుంచి సినిమా పుంజుకుంది. రెండువారాల్లో ఈ సినిమా హిట్‌గా నిలిచింది. మొత్తంగా ప్రేక్షకుల స్పందన ఆనందం కలిగిస్తోంది' అని సుదర్శన్ రెడ్డి తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement