breaking news
profitable venture
-
లాభసాటి బిజినెస్, మోడ్రన్ డ్రెస్సింగ్‌కు కేరాఫ్‌గా బొటిక్
జగిత్యాలటౌన్: మహిళల మోడ్రన్ డ్రెస్సింగ్‌కు కేరాఫ్‌గా బొటిక్‌లు నిలుస్తున్నాయి. ప్రస్తుత కాలంలో ట్రెండుతో పాటు మహిళల ఆసక్తి, అభిరుచికి తగిన విధంగా అనేక రంగులు, డిజైన్లు, మెటీరియల్ ఒకేచోట లభిస్తుండటంతో బొటిక్‌లకు డిమాండ్ పెరిగింది. గతంలో ఒక షాపులో మెటీరియల్ కొనుగోలు చేసి దానికి లైనింగ్ మరోచోట, స్టిచింగ్ ఇంకో చోట ఇలా పలు దుకాణాలు తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం ఉద్యోగాలు, వ్యాపారాల నిర్వహణతో బిజీగా మారిన మహిళలకు వన్‌స్టెప్ సర్వీస్ అందజేస్తున్న బొటిక్‌లు వరంగా మారాయి. మెటీరియల్, లైనింగ్, డిజైనింగ్‌తో పాటు స్టిచింగ్ కూడా ఒకేచోట లభిస్తుండటంతో మహిళలు బొటిక్‌లకు క్యూ కడుతున్నారు. పండగలు, ఫంక్షన్లు, పార్టీలు, సందర్భం ఏదైనా బొటిక్కు వెళ్లి అకేషన్ డీటేల్స్ చెప్తే చాలు మెటీరియల్ సెలెక్షన్ దగ్గర నుంచి కంప్యూటర్ డిజైనింగ్ మగ్గం వర్క్ ఏది కావాలంటే అది, ఎలా కావాలంటే అలా రెడీ చేసి కస్టమర్లకు డెలివరీ చేయడం బొటిక్‌ల ప్రత్యేకత. అభిరుచికి అనుగుణంగా.. గతంలో కస్టమర్లు మ్యాచింగ్ బ్లౌజులు మాత్రమే అడిగేవారు. ప్రస్తుతం మారుతున్న మహిళల ఆలోచన, అభిరుచికి అనుగుణంగా మగ్గం వర్క్, బోట్‌నెక్, కంప్యూటర్ బ్లౌజులకు గిరాకీ పెరిగింది. అకేషన్ డీటేల్స్ చెప్తే ఏది వేసుకుంటే బాగుంటుందో సజెస్ట్ చేయడమే కాకుండా కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా మెటీరియల్ సెలెక్షన్, డిజైన్, మగ్గం వర్క్‌తో ట్రెండీ బ్లౌజెస్ రెడీ చేసి ఇస్తాం. అందుబాటు ధరల్లో అనుకున్న డిజైన్లు అనుకున్న సమయానికి డెలివరీ ఇస్తున్నాం. బొటిక్ నిర్వహణతో స్వయం ఉపాధితో పాటు పదిమందికి పని కల్పిస్తున్నామనే సంతృప్తి ఉంది. – ప్రణీత, బొటిక్ నిర్వాహకురాలు మహిళల అభిరుచిని బట్టి బోట్‌నెక్, మగ్గం వర్క్, కంప్యూటర్ డిజైన్డ్ బ్లౌజెస్ అందుబా టులో ఉన్నాయి. మగ్గం వర్క్ బ్లౌజెస్ ధరలు రూ.1400 నుంచి రూ.10వేల వరకు ఉండగా, బోట్‌నెక్ బ్లౌజులకు రూ.400 నుంచి రూ. వెయ్యి చార్జ్ చేస్తున్నారు. కంప్యూటర్ డిజైన్డ్ బ్లౌజులకు రూ.500 నుంచి రూ.3వేల వరకు మెటీరియల్ డిజైన్ బట్టి ధర నిర్ణయిస్తారు. -
డివైడ్ టాక్ వచ్చినా.. భారీ వసూళ్లు!
చెన్నై: చాలాకాలంగా హిట్ సినిమా లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న హీరో సునీల్‌కు 'జక్కన్న' కొత్త ఊపిరి ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం చెప్పుకోదగినస్థాయిలో సాధించింది. 'జక్కన్న' సినిమా రెండువారాల్లోనే రూ. 16 కోట్లు వసూలుచేసిందని టాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు త్రినాథ్ తెలిపారు. 'సునీల్‌కు 'జక్కన్న' ఊరటనిచ్చింది. ఈ సినిమా నిర్మాతకు లాభదాయకంగా నిలిచింది. రెండువారాల్లోనే 'జక్కన్న' బాక్సాఫీస్ వద్ద రూ. 16కోట్లు వసూలు చేశాడు. దీంతో హిట్ కోసం సునీల్ ఎదురుచూపులు ఫలించాయనే చెప్పొచ్చు' అని త్రినాథ్ ఐఏఎన్ఎస్కు చెప్పారు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో సునీల్, మన్నారా చోప్రా జోడీగా 'జక్కన్న' ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టడంపై నిర్మాత సుదర్శన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. 'సినిమాకు మొదటిరోజు డివైడ్ టాక్ వచ్చింది. కానీ రెండోరోజు నుంచి సినిమా పుంజుకుంది. రెండువారాల్లో ఈ సినిమా హిట్‌గా నిలిచింది. మొత్తంగా ప్రేక్షకుల స్పందన ఆనందం కలిగిస్తోంది' అని సుదర్శన్ రెడ్డి తెలిపారు.