భారీ బడ్జెట్‌: కలెక్షన్లు బాగున్నా.. ప్లాప్‌ తప్పదా!

భారీ బడ్జెట్‌: కలెక్షన్లు బాగున్నా.. ప్లాప్‌ తప్పదా!


'జగ్గా జాసూస్‌'.. రణబీర్‌ కపూర్‌, కత్రినా కైఫ్‌ జంటగా నటించిన తాజా మ్యూజికల్‌ అడ్వెంచర్‌ మూవీ. మొదటి వారాంతంలో ఈ సినిమా చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. తొలి మూడురోజుల్లో బాక్సాఫీస్‌ వద్ద దాదాపు రూ. 35 కోట్లు వసూలు చేసింది. నిజానికి ఇవి మంచి వసూళ్లే. చిన్న సినిమా అయితే.. ఈపాటికి సూపర్‌హిట్‌ క్రెడిట్‌ కూడా వచ్చేది. కానీ, 'జగ్గా జసూస్‌' భారీ బడ్జెట్‌ సినిమా. ప్రఖ్యాత నిర్మాణ డిస్నీ.. ఫీల్‌గుడ్‌ కంటెంట్‌తో రూ. 110 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించింది. అందుకే ఈ సినిమా హిట్టా.. ఫట్టా ఇప్పుడే చెప్పలేమంటున్నారు బాలీవుడ్‌ ట్రేడ్‌ విశ్లేషకులు.బాలీవుడ్‌ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ లెక్కల ప్రకారం.. జగ్గాజాసూస్‌ తొలిరోజు రూ. 8.57 కోట్లు వసూలు చేసింది. రెండోరోజు రూ. 11.53 కోట్లు రాబట్టింది. మూడోరోజు ఆదివారం మరికాస్త మెరుగుపడి రూ. 13.07 కోట్లను సొంతం చేసుకుంది. మొత్తం రూ. 33.17 కోట్లను ఈ చిత్రం రాబట్టింది. ఈ సినిమాకు క్రమంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ పెరుగుతుండటం ఊరట కలిగించే విషయం. అయితే, రూ. 110 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా నష్టాలను తప్పించుకుంటుందా? అన్నది సోమవారం వసూళ్ల వివరాలు వస్తే తప్పా చెప్పలేమని బాలీవుడ్‌ సినీ పండితులు అంటున్నారు. రూ. 40.. రూ. 50 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొంది ఉంటే.. లాభాలు దక్కించుకొని ఉండేదని అంటున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top