అమ్మకానికి జాక్వెలిన్ కెన్నడీ కెమేరా | Jackie Kennedy's personal photo gear up for sale on eBay | Sakshi
Sakshi News home page

అమ్మకానికి జాక్వెలిన్ కెన్నడీ కెమేరా

Jul 23 2016 6:32 PM | Updated on Sep 4 2017 5:54 AM

అమ్మకానికి జాక్వెలిన్ కెన్నడీ కెమేరా

అమ్మకానికి జాక్వెలిన్ కెన్నడీ కెమేరా

జాక్వెలిన్ కెన్నడీ ఒనాసిస్ చాలామందికి అమెరికా మాజీ ప్రథమ పౌరురాలిగానే పరిచయం.

వాషింగ్టన్: జాక్వెలిన్ కెన్నడీ ఒనాసిస్ చాలామందికి అమెరికా మాజీ ప్రథమ పౌరురాలిగానే పరిచయం. ఆమె జేఎఫ్ కెన్నడీని పెళ్లి చేసుకోవడానికి ముందు వాషింగ్టన్ టైమ్స్-హెరాల్డ్ న్యూస్ పేపర్‌కు ఫొటో జర్నలిస్ట్‌గా పనిచేశారు. ఆ సమయంలో అంటే, 1952లో ఆమెకు వారానికి 43 డాలర్ల వేతనం వచ్చేది. అప్పట్లో ఆమె విధి నిర్వహణలో భాగంగా ఉపయోగించిన ఓ కెమెరా, దానికి సంబంధించిన రెండు లెన్స్‌లు ఇప్పుడు ఈబేలో వేలానికి వచ్చాయి.

‘లీకాఫ్లెక్స్ ఎస్‌ఎల్ ఎస్‌ఎల్‌ఆర్’ కెమెరాతోపాటు రెండు లైట్జ్ వెట్జ్‌లార్ కెమేరా లెన్సులను అమ్మకానికి పెట్టారు. కెమేరా ప్రాథమిక ధరను 8,995 డాలర్లుగా, లెన్స్‌ల ధరలను వరుసగా 2,750, 2,500 డాలర్లుగా నిర్ణయించారు. వాస్తవానికి ఈ పరికరాలు 2005లో వేలానికి రాగా ‘ఇక్వాటోగ్రాఫ్స్’ సంస్థ కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ సంస్థ మళ్లీ ఈబే ద్వారా అమ్మకానికి పెట్టింది. అప్పుడు ఈబే ఇచ్చిన సేల్ సర్టిఫికెట్‌తోపాటు ఎస్‌ఎల్‌ఆర్ కెమెరాతో జాక్వెలిన్ కెన్నడీ దిగిన ఫొటోను కూడా ప్రదర్శనకు పెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement