సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అన్నిరకాలుగా ఒత్తిడి పెరిగిపోతోంది. వారాంతంలో ఇచ్చే రెండు రోజుల సెలవులు వెంటవెంటనే రావడంతో ఆ రెండు రోజులు ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాయి. దీనికి తోడు రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్సులు.. ఇలా అన్నిచోట్లా ఆ రెండు రోజులు విపరీతమైన రద్దీ ఉంటోంది. దీనంతటికీ పరిష్కారంగా వారాంతంలో ఇచ్చే రెండు రోజుల సెలవును కొద్దిగా మార్చి, ఆదివారం ఒక రోజు.. వారం మధ్యలో మరో రోజు ఇస్తే ఎలా ఉంటుందని బెంగళూరులోని కొన్ని దిగ్గజ ఐటీ కంపెనీలు ఆలోచిస్తున్నాయి. ఈ విషయాన్ని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) ఎంఏ సలీం కూడా నిర్ధరించారు. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డు మీద ఉన్న మాన్యత టెక్ పార్కులోను, వైట్‌ఫీల్డ్, ఐటీబీపీ ప్రాంతాల్లో ఉన్న చాలా ఐటీ కంపెనీలు తమ సిబ్బందికి ఇచ్చే వారాంతపు సెలవుల పద్ధతిని మార్చేందుకు ఓకే అంటున్నాయని ఆయన చెప్పారు. ఇదే అన్ని రకాలుగా మంచిదని తాము కూడా చెబుతున్నామని, దానివల్ల రోడ్డు మీద ట్రాఫిక్ తగ్గడంతో పాటు, ఉద్యోగులకు కూడా ఒత్తిడి చాలావరకు తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఐదు రోజుల పాటు వరుసగా పనిచేయడం వల్ల ఉద్యోగులకు చాలా ఒత్తిడి ఉంటుందని, ఇంత ఎక్కువ స్థాయిలో ఒత్తిడి ఉండే ఉద్యోగాలలో వరుసగా పనిచేయించడం తమకూ అంత మంచిది కాదని, అదే మధ్యలో ఒకరోజు బ్రేక్ ఇస్తే.. వాల్లు మరింత ప్రశాంతంగా పని చేయగలుగుతున్నారని సీనియర్ హెచ్ఆర్ మేనేజర్ అనురాగ్ పటేల్ చెప్పారు. శుక్రవారం సాయంత్రానికి చాలావరకు ఉద్యోగులు విపరీతంగా ఒత్తిడికి గురై పబ్‌లకు వెళ్లిపోతున్నారని, ఈ ట్రెండు తగ్గాలంటే వారానికి రెండు రోజులు వరుసగా కాకుండా వేర్వేరుగా సెలవులు ఇవ్వడమే సరైన ఉపాయమని ఐటీ ఉద్యోగి అంకిత్ చెప్పాడు.
వారం మధ్యలో బ్రేక్ ఇస్తే!
Published Wed, Oct 21 2015 3:42 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement