నిఘా అధికారుల బైకు హుష్ కాకి! | Intelligence Bureau bike stolen in Goa | Sakshi
Sakshi News home page

నిఘా అధికారుల బైకు హుష్ కాకి!

Apr 16 2014 4:22 PM | Updated on Sep 2 2017 6:07 AM

నిఘా అధికారులు అనగానే వాళ్లకు వెయ్యి కళ్లుంటాయని, చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతుందని అనుకుంటాం కదూ. కానీ, వాళ్ల బైకే ఒకటి చోరీకి గురైంది.

నిఘా అధికారులు అనగానే వాళ్లకు వెయ్యి కళ్లుంటాయని, చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతుందని అనుకుంటాం కదూ. కానీ, ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూస్తే.. వాళ్లు కూడా దొంగతనాలు, చోరీల బాధితులే అవుతున్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రం గోవాలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులకు చెందిన ఒక మోటారు సైకిల్ చోరీకి గురైంది.

గుర్తుతెలియని వ్యక్తులు ఈ మోటారు సైకిల్ను దొంగిలించారంటూ నగర పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా నమోదైంది. తాను ఒక బ్యాంకు వద్ద తన మోటారు సైకిల్ పార్క్ చేసి ఉంచగా, ఎవరో దాన్ని ఎత్తుకెళ్లిపోయారంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్ శాంతా మడివాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అధికారులు, బైకు ఎక్కడుండా అని గాలించడం మొదలుపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement