ఇండిగో విమానంలో మంటలు | Indigo plane catches fire in Kathmandu, passengers safe | Sakshi
Sakshi News home page

ఇండిగో విమానంలో మంటలు

Mar 8 2014 3:17 PM | Updated on Sep 2 2017 4:29 AM

ఇండిగో విమానంలో మంటలు

ఇండిగో విమానంలో మంటలు

నేపాల్ రాజధాని ఖాట్మాండ్లో శనివారం ఇండిగో విమానంలో మంటలు చెలరేగాయి.

నేపాల్ రాజధాని ఖాట్మాండ్లో శనివారం ఇండిగో విమానంలో మంటలు చెలరేగాయి. ఖాట్మాండ్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అప్పుడే దిగిన ఇండిగో విమానం కుడి భాగంలో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఆ విషయాన్ని వెంటనే ఎయిర్ట్పోర్ట్ సిబ్బంది వెంటనే గుర్తించి, అగ్నిమాపక సిబ్బందితో మంటలను ఆర్పివేశారు.

 

అయితే ఇండిగో విమానంలో మొత్తం 174 మంది ప్రయాణికులను సురక్షితంగా ఎయిర్ పోర్ట్ సిబ్బంది కిందకు దింపారు.  ఆ ఇండిగో విమానం శనివారం ఉదయం న్యూఢిల్లీ నుంచి ఖాట్మాండ్ బయలుదేరింది.  అయితే శుక్రవారం నేపాల్ ఎయిర్ లైన్స్కు చెందిన విమాన ఇంజన్లో అవాంతరం ఏర్పడటంతో త్రిభువన్ ఎయిర్పోర్ట్లో వెంటనే దింపివేసిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement