హిమాలయ బోర్డు ఏర్పాటు చేయాలి  | Sadhguru Jaggi Vasudev calls for 5-nation Himalayan Board to tackle disasters | Sakshi
Sakshi News home page

హిమాలయ బోర్డు ఏర్పాటు చేయాలి 

Sep 1 2026 6:25 AM | Updated on Sep 1 2026 6:25 AM

Sadhguru Jaggi Vasudev calls for 5-nation Himalayan Board to tackle disasters

సద్గురు జగ్గీ వాసుదేవ్‌ డిమాండ్‌ 

కఠ్మాండు: హిమాలయ ప్రాంతాల్లో విపత్తులను ఎదుర్కోవడానికి ఐదు సరిహద్దు దేశాలతో కలిపి హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని ఆధ్మాతి్మక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ డిమాండ్‌చేశారు. సున్నితమైన ఈ పర్వత ప్రాంతానికి రాజకీయాలకు అతీతంగా భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్‌లతో కూడిన సరిహద్దు సహకారం అవసరమన్నారు. ఆదివారం కఠ్మాండులో ఏర్పాటు చేసిన ‘నేపాల్‌కు సంఘీభావం’కార్యక్రమంలో ప్రసంగించారు.

 తక్షణ సహాయానికి మించి, హిమాలయాలపై విస్తృతస్థాయిలో సామూహిక బాధ్యత అవసరమని సద్గురు పిలుపునిచ్చారు. ఆ పర్వతాలు దేశాల మధ్య గీసిన సరిహద్దులకు అతీతమైనవని, వాటి భవిష్యత్తు వాటిపై ఆధారపడిన వారందరికీ సంబంధించినదని గుర్తించాలని ఆయన అన్నారు. ‘పర్వతాలకు మీ రాజకీయాలు తెలియదు. మీరు మాట్లాడే అర్థంలేని మాటలు లేదా భాష పర్వతాలకు తెలియదు. 

హిమాలయ ప్రాంతం భూమిపై అద్భుతమైన, సున్నితమైన ప్రాంతం. అటువంటి పర్వతాల రక్షణ కోసం అవి విస్తరించి ఉన్న దేశాలన్నింటితో కూడిన ఒక సంస్థ ఏర్పాటు తక్షణ అవసరం. ఈ విపత్తు తీవ్రత ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. దీని పరిణామాలను నేపాల్‌ లాంటి చిన్నదేశం ఒంటరిగా ఎదుర్కోలేదు. మనం దీనిపై దృష్టి పెట్టాలి’అని ఆయన అన్నారు.  

కోటి రూపాయల విరాళం.. 
నేపాల్‌ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి కోటి రూపాయల విరాళంగా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారని ఇషా ఫౌండేషన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. చైనా–నేపాల్‌ సరిహద్దు సమీప ప్రాంతాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల తర్వాత ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది యాత్రికుల బృందం ఆచూకీ లేకుండా పోయింది. నేపాల్‌ వైపున ఉన్న ముగ్గురు ఇషా వలంటీర్ల ఆచూకీ లభ్యం కాలేదని తెలిపింది. ఇషా ఫౌండేషన్‌ ప్రతి సీజన్‌లో కైలాస్‌ మానసరోవర్‌ యాత్రలను నిర్వహిస్తోంది. యాత్రలో భాగంగా కాలినడకన ట్రెక్కింగ్‌ చేస్తూ బృందాలు కఠ్మాండు నుంచి నేపాల్‌ మీదుగా టిబెట్‌కు వెళ్తాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement