ప్రియురాలిని హత్య చేసి.... | Indian man stabs lover to death in UAE; tries to commit suicide | Sakshi
Sakshi News home page

ప్రియురాలిని హత్య చేసి....

Sep 17 2015 6:49 PM | Updated on Sep 3 2017 9:34 AM

ప్రియురాలిని హత్య చేసి....

ప్రియురాలిని హత్య చేసి....

యూఏఈలో ప్రియురాలిని హత్య చేసి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడో భారతీయుడు.

దుబాయ్: యూఏఈలో ప్రియురాలిని హత్య చేసి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడో భారతీయుడు. నిందితుడు అబుదాబిలో ఒక హోటల్ ముందు ప్రియురాలిని కత్తితో పొడిచి చంపాడు. తర్వాత సముద్రంలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడని ఆంతరంగిక మంత్రిత్వ శాఖ తెలిపింది. నిందితుడిని పేరును ఎంఏ, అతడి ప్రియురాలి పేరును కేకే అని మాత్రమే వెల్లడించింది.

అసూయతో అతడు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. సముద్రంలోకి దూకిన నిందితుడిని తీరపరిరక్షక దళాలు కాపాడాయని గల్ఫ్ న్యూస్ తెలిపింది. అతడిని ఆస్పత్రిలో చేర్చారు. కోలుకున్నాక అతడిని అధికారులు ప్రశ్నించనున్నారు. నిందితుడు, హతురాలి పూర్తి వివరాలు వెల్లడికాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement