
వాష్ రూములోకి తొంగిచూసినందుకు...
మహిళల వాష్ రూములోకి తొంగిచూసిన నేరంలో దుబాయ్ లో 26 ఏళ్ల భారతీయ కార్మికుడొకరు జైలు పాలయ్యాడు.
దుబాయ్: మహిళల వాష్ రూములోకి తొంగిచూసిన నేరంలో దుబాయ్ లో 26 ఏళ్ల భారతీయ కార్మికుడొకరు జైలు పాలయ్యాడు. నేరం రుజువు కావడవంతో నిందితుడికి కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తైన తర్వాత తమ దేశం విడిచి వెళ్లాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఓ మసీదులోని మహిళల వాష్ రూములోకి తొంగిచూస్తూ పట్టుబడడంతో అతడపై కేసు నమోదైంది. గోడ వెనుకవైపున ఉన్న చిన్న గదిలో నుంచి వాష్ రూములోని తమను గమనిస్తున్నాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిందని 'ఖలీల్ టైమ్స్' తెలిపింది. మొదటి తప్పుగా పరిగణించి మూడు నెలల జైలు శిక్ష విధించినట్టు కోర్టు పేర్కొంది.