అమెరికాతో లాబీయింగ్ చేస్తున్న భారత్ | Sakshi
Sakshi News home page

అమెరికాతో లాబీయింగ్ చేస్తున్న భారత్

Published Sat, Feb 25 2017 9:45 AM

అమెరికాతో లాబీయింగ్ చేస్తున్న భారత్ - Sakshi

న్యూఢిల్లీ : హెచ్-1బీ వీసాలపై అమెరికా కాంగ్రెస్ తీసుకొస్తున్న నిబంధనలపై భారత్ తన లాబీయింగ్ను వేగవంతం చేసింది. స్కిల్డ్ వర్కర్లకు ఇచ్చే వీసాల్లో ఆంక్షలు విధించడం, టెక్నాలజీ సెక్టార్కు ప్రమాదకరమని అమెరికాతో భారత్ వాదిస్తోంది. వీసా నిబంధనల్లో తీసుకొస్తున్న మార్పులతో 3.5 మిలియన్లకు పైగా  ఉద్యోగులకు తీవ్ర ప్రభావం చూపనుందని భారత్ ఆందోళన వ్యక్తంచేస్తోంది. 150 బిలియన్ డాలర్ల దేశీయ ఐటీ సర్వీసుల ప్రాముఖ్యత గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యాలయానికి వివరించామని పరిశ్రమల, వాణిజ్య శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అమెరికాలో భారత్ పెట్టుబడులు, అమెరికన్ సిటిజన్లకు ఉద్యోగాలు కల్పిస్తుందని ఆమె తెలిపారు. అమెరికా కొత్త అడ్మినిస్ట్రేషన్తో ఎప్పడికప్పుడూ చర్చిస్తూనే ఉన్నామని పేర్కొన్నారు.
 
అమెరిన్లకే ఉద్యోగాలు అనే ట్రంప్ నినాదంతో మన అతిపెద్ద ఐటీ ఇండస్ట్రి పరిస్థితి అతలాకుతలమవుతోంది. దేశీయ ఐటీ కంపెనీలకు షాకిస్తూ హెచ్-1బీ వీసా హోల్డర్స్కు కనీసం వేతనం రెట్టింపు చేస్తూ గత నెల అమెరికా కాంగ్రెస్ ఓ బిల్లును కూడా ప్రవేశపెట్టింది. దీంతో హెచ్-1బీ వీసా ఆందోళనలు భారీగా పెరిగాయి. దేశీయ హై-టెక్ ఇండస్ట్రి అసోసియేషన్ నాస్కామ్ సైతం అమెరికా చట్టసభ్యులు, కంపెనీలతో చర్చలు చేపట్టింది. అమెరికాలోకి ప్రవేశించే స్కిల్డ్ వర్కర్లపై ఎలాంటి ఆంక్షలు పెట్టవద్దంటూ తన విన్నపాలు వివరించింది.    

Advertisement
 
Advertisement
 
Advertisement