పాకిస్థాన్ కు భారత్ తీవ్ర నిరసన | India lodges protest with Pakistan over ceasefire violation | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ కు భారత్ తీవ్ర నిరసన

Jul 16 2015 9:29 AM | Updated on Mar 23 2019 8:23 PM

సరిహద్దులో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

న్యూఢిల్లీ: సరిహద్దులో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పాక్ పదే పదే ఉల్లంఘనకు పాల్పడడంపై పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ కు కేంద్రం తీవ్ర నిరసన తెలిపిందని ప్రభుత్వ వర్గాలు గురువారం వెల్లడించాయి.

జమ్మూ జిల్లాలోని అక్నూర్ సెక్టార్ లో పాక్ బలగాలు బుధవారం జరిపిన కాల్పుల్లో ఓ మహిళ మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరు సైనికులు ఉన్నారు. ఇటీవల కాలంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్ బలగాలు పదే పదే కాల్పులకు దిగుతున్నాయి. నిన్నటి దాడిలో 5 భారత సైనిక స్థావరాలను పాక్ బలగాలు లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement