
మాదాపూర్‌లో కార్పొరేట్ ఇన్‌క్యుబేటర్ ప్రారంభం
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం ప్రోగ్రెసివ్ సాఫ్ట్‌వేర్ సంస్థ మాదాపూర్‌లో కార్పొరేట్ పసిఫిక్ ఇన్‌క్యుబేటర్‌ను ప్రారంభించింది.
సాక్షి, హైదరాబాద్: ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం ప్రోగ్రెసివ్ సాఫ్ట్‌వేర్ సంస్థ మాదాపూర్‌లో కార్పొరేట్ పసిఫిక్ ఇన్‌క్యుబేటర్‌ను ప్రారంభించింది. సైయింట్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా మంగళవారం దీన్ని ప్రారంభించారు. స్టార్టప్ కంపెనీలకు సలహాలు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించటం తమ ఇన్‌క్యుబేటర్ లక్ష్యమని, ఇది దేశంలోనే మొదటి కార్పోరేట్ ఇన్‌క్యుబేటర్ అని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రిపుల్‌ఐటీ డెరైక్టర్ పి.జె.నారాయణ, ప్రోగ్రెసివ్ సాఫ్ట్‌వేర్ సంస్థ ఎండీ రమేష్ లోగనాథన్, డేవ్ బెన్‌సన్ తదితరులు పాల్గొన్నారు.