నేడు ఇంద్రాణి భర్త వాంగ్మూలం | In Sheena Bora Murder Case, Peter Mukerjea to Record Statement | Sakshi
Sakshi News home page

నేడు ఇంద్రాణి భర్త వాంగ్మూలం

Sep 2 2015 10:27 AM | Updated on Sep 3 2017 8:37 AM

దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి భర్త టీవీ మీడియా టైకూన్, స్టార్ ఇండియా మాజీ చైర్మన్ పీటర్ ముఖర్జియా వాంగ్మూలాన్ని బుధవారం రికార్డు చేయనున్నారు.

ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి భర్త టీవీ మీడియా టైకూన్, స్టార్ ఇండియా మాజీ చైర్మన్ పీటర్ ముఖర్జియా వాంగ్మూలాన్ని బుధవారం రికార్డు చేయనున్నారు. గత వారమే ఆయన వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని ముంబయి పోలీసులు కోరగా తాను లిఖిత పూర్వక వివరణ ఇస్తానని చెప్పారు. అందుకు నిరాకరించిన పోలీసులు నేరుగా వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని అన్నారు.

దీంతో ఆయన బుధవారం నేరుగా వచ్చి వాంగ్మూలం ఇవ్వనున్నట్లు తెలిసింది. షీనా హత్య గురించి తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఆయన కేసు దర్యాప్తునకు తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పారు. 2012లో పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాణి ముఖర్జియా తన కన్నకూతురిని హత్య చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె పోలీసుల రిమాండ్లో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement