కార్పొరేట్లకు బ్యాంకు లెసైన్సులొద్దు: స్థాయీ సంఘం | House panel opposes bank licence for corporates | Sakshi
Sakshi News home page

కార్పొరేట్లకు బ్యాంకు లెసైన్సులొద్దు: స్థాయీ సంఘం

Sep 28 2013 12:56 AM | Updated on Sep 1 2017 11:06 PM

కార్పొరేట్ సంస్థలకు కొత్త బ్యాంకు లెసైన్సులు ఇచ్చే అంశాన్ని పార్లమెంటరీ స్థాయీ సంఘం వ్యతిరేకించింది.

న్యూఢిల్లీ: కార్పొరేట్ సంస్థలకు కొత్త బ్యాంకు లెసైన్సులు ఇచ్చే అంశాన్ని పార్లమెంటరీ స్థాయీ సంఘం వ్యతిరేకించింది. దీని వల్ల బ్యాంకింగ్ రంగ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశముందని అభిప్రాయపడింది. ఇలాంటి విధానం ప్రపంచంలో ఎక్కడా లేదని, భారత్ ఇందుకు మినహాయింపు కాదని స్థాయీ సంఘం నివేదికలో పేర్కొంది. మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ నేత యశ్వంత్ సిన్హా సారథ్యంలోని స్థాయి సంఘం(ఆర్థిక) ఈ నివేదికను రూపొందించింది. లెసైన్స్‌ల విషయంలో ఆర్‌బీఐకి ఇచ్చిన విచక్షణాధి కారాలవల్ల ఏకపక్షంగా దరఖాస్తులను ఆమో దం/తిరస్కరణ అధికారం లభిస్తుందనేది సభ్యుల వాదన. కొత్త బ్యాంక్ లెసైన్సులను జారీ చేసేందుకు 2001 నాటి మార్గదర్శకాలే ప్రాతిపదికగా ఉండాలని సభ్యులు అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement