'నాన్-వెజ్' నోట్లను వద్దంటున్న ఆలయాలు

'నాన్-వెజ్' నోట్లను వద్దంటున్న ఆలయాలు

కొత్త ఐదు పౌండ్ల నోట్లను యూకేలోని హిందూ దేవాలయాలు రద్దు చేశాయి. ఈ కొత్త నోట్లలో జంతు కొవ్వు జాడలున్నాయని రిపోర్టులు వస్తున్న నేపథ్యంలో ఈ నోట్లను తాము అంగీకరించేంది లేదంటూ హిందూ దేవాలయాలు ప్రకటించాయి. ఈ కొత్త నోట్లను  జంతు కొవ్వుతో గతవారం గుర్తించినట్టు రిపోర్టులు వచ్చాయి. ఈ కొవ్వును గొడ్డు లేదా మటన్ నుంచి సేకరిస్తారని తెలియగానే, వెజిటేరియన్లు, మత గ్రూపులు ఈ నోట్ల తయారీపై మండిపడ్డారు.. ఎక్స్చేంజ్గా ఈ 'నాన్-వెజ్' నోట్లను సీజ్ చేస్తున్నామని, కానీ ఈ విషయాన్ని కమ్యూనికేట్ చేసే విషయంలోనే కొంత గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశముందని హిందూ ఆలయాల జాతీయ కౌన్సిల్ ఓ ప్రకటనలో తెలిపింది.

 

అయితే ఎన్ని ఆలయాల్లో ఈ 'నాన్-వెజ్' నోట్లను రద్దు చేశారో సరియైన సమాచారం లేదని పేర్కొంది. హిందూ ఆర్గనైజేషన్లకు బాడీగా ఉంటున్న హిందూ ఫోరమ్ ఆఫ్ బ్రిటన్(హెచ్ఎఫ్బీ) గతవారం రోజులుగా ఓ నోటీసు జారీచేస్తోంది. ఈ నోటీసులో నోట్లను విత్డ్రా చేసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారని, డొనేషన్లకు ఈ నోట్ల వాడద్దొంటూ హెచ్ఎఫ్‌బీ తన ప్రకటనలో పేర్కొంటోంది. కొత్త నోట్లను జంతువుల కొవ్వుతో తయారుచేయడాన్ని రద్దు చేసుకోవాలని దాదాపు 1,30,000 సంతకాలు నమోదయ్యాయి. ఈ సంతకాలు 1,50,000 నమోదైతే, బ్యాంకు ఆఫ్‌ ఇంగ్లాండ్కు పంపించనున్నారు. 

 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top