హెలికాఫ్టర్ కూలి నలుగురు సైనికులు మృతి | Helicopter crash kills four soldiers in Colombia | Sakshi
Sakshi News home page

హెలికాఫ్టర్ కూలి నలుగురు సైనికులు మృతి

Feb 25 2014 9:22 AM | Updated on Sep 2 2017 4:05 AM

మధ్య కొలంబియా మేటా ప్రావెన్స్ నగరంలోని మెసెటస్ సమీపంలో హెలికాఫ్టర్ కూలిన దుర్ఘటనలో నలుగురు సైనికులు మరణించారు.

మధ్య కొలంబియా మేటా ప్రావెన్స్ నగరంలోని మెసెటస్ సమీపంలో హెలికాఫ్టర్ కూలిన దుర్ఘటనలో నలుగురు సైనికులు మరణించారని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు. గోరిల్లా గ్రూప్లతో పోరాటానికి వెళ్లిన సైనికులకు సహాయ సామాగ్రిని అందించేందుకు ఆ హెలికాఫ్టర్ పంపినట్లు తెలిపారు.

 

అయితే వాతావరణం కూడా సరిగ్గా లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆటవీ ప్రాంతంలో హెలికాఫ్టర్ తక్కువ ఎత్తులో ప్రయాణిస్తు చెట్టును ఢీ కొందని సైనికాధికారులు వెల్లడించారు. సైనికుల మృతదేహలను ఆచూకీ తెలుసుకునేందుకు ఆర్మీ ఇప్పటికే రంగంలోకి దిగిందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement