హెలికాఫ్టర్ కూలి నలుగురు సైనికులు మృతి
మధ్య కొలంబియా మేటా ప్రావెన్స్ నగరంలోని మెసెటస్ సమీపంలో హెలికాఫ్టర్ కూలిన దుర్ఘటనలో నలుగురు సైనికులు మరణించారని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు. గోరిల్లా గ్రూప్లతో పోరాటానికి వెళ్లిన సైనికులకు సహాయ సామాగ్రిని అందించేందుకు ఆ హెలికాఫ్టర్ పంపినట్లు తెలిపారు.
అయితే వాతావరణం కూడా సరిగ్గా లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆటవీ ప్రాంతంలో హెలికాఫ్టర్ తక్కువ ఎత్తులో ప్రయాణిస్తు చెట్టును ఢీ కొందని సైనికాధికారులు వెల్లడించారు. సైనికుల మృతదేహలను ఆచూకీ తెలుసుకునేందుకు ఆర్మీ ఇప్పటికే రంగంలోకి దిగిందన్నారు.