భారీ వర్షాలతో ఉత్తరాది విలవిల | heavy rains in the northern vilavila | Sakshi
Sakshi News home page

భారీ వర్షాలతో ఉత్తరాది విలవిల

Jul 12 2015 1:58 AM | Updated on Sep 3 2017 5:19 AM

ఎడతెరిపిలేని భారీ వర్షాలతో ఉత్తర భారతం కుదేలైంది.

న్యూఢిల్లీ: ఎడతెరిపిలేని భారీ వర్షాలతో ఉత్తర భారతం కుదేలైంది. శుక్ర, శనివారాల్లో పలు రాష్ట్రాల్లో కుండపోత వానల వల్ల జనజీవనం స్తంభించింది. దేశ రాజధాని ఢి ల్లీ వీధుల్లో నీరు చేరడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. నగరంలో 147.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఢిల్లీలో ఈ సీజన్‌లో ఇదే అత్యధిక వర్షపాతం. హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement