హర్భజన్‌ కూతురు పేరేమిటో తెలుసా! | Harbhajan Singh, Geeta Basra announce name of newborn daughter | Sakshi
Sakshi News home page

హర్భజన్‌ కూతురు పేరేమిటో తెలుసా!

Sep 4 2016 12:04 PM | Updated on Sep 4 2017 12:18 PM

హర్భజన్‌ కూతురు పేరేమిటో తెలుసా!

హర్భజన్‌ కూతురు పేరేమిటో తెలుసా!

భారత క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌-గీతా బస్రా దంపతులు తాజాగా పండంటి బిడ్డను కన్నారు.

న్యూఢిల్లీ: భారత క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌-గీతా బస్రా దంపతులు తాజాగా పండంటి బిడ్డను కన్నారు. గత ఏడాది పెళ్లి చేసుకున్న ఈ జంటకు గత జూలైలో ఆడబిడ్డ పుట్టింది. తమ ముద్దుల కూతురి పేరేమిటో తాజాగా వీరు తమ ట్విట్టర్‌ పేజీలో వెల్లడించారు. తమ బిడ్డకు 'హినయ హీర్‌ ప్లహా' అని పేరు పెట్టామని వారు తెలిపారు. పాపకు ఆశీస్సులు అందజేసిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

టర్బోనేటర్‌ భజ్జీ గత ఏడాది ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రేమికురాలు అయిన బాలీవుడ్‌ నటి గీతా బస్రాను ఆయన పెళ్లాడారు. ఇక మహేంద్రసింగ్‌ ధోనీ కూతురి పేరు 'జివా' కాగా, భజ్జీ కూతురి పేరు 'హినయ' అని పెట్టడం బాగుందని భారత క్రికెట్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement