
సినీ మాంత్రికుడికి వెల్లువెత్తుతున్న విషెస్!
అపజయం ఎరుగుని సినీ మాంత్రికుడు.. వరుస విజయాలతో టాలీవుడ్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు..
అపజయం ఎరుగుని సినీ మాంత్రికుడు.. వరుస విజయాలతో టాలీవుడ్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు.. ‘బాహుబలి’తో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న సినీ మేధావి ఎస్‌ఎస్ రాజమౌళి. ప్రస్తుతం సినీ ప్రపంచం మొత్తం ఆయన తదుపరి దృశ్యకావ్యం 'బాహుబలి-2' కోసం ఎదురుచూస్తోంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో.. దానిని ఈ సినీ మాంత్రికుడు ఎలా చూపిస్తాడో తెలుసుకునేందుకు ఆసక్తిగా నిరీక్షిస్తున్నది. ఈ క్రమంలో దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి సోమవారం (అక్టోబర్ 10న) పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
ఆయన పుట్టినరోజు గురించి తెలియడంతో సినీ ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహర్, తరణ్ ఆదర్శ్, హీరో సునీల్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు ట్విట్టర్‌లో రాజమౌళికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం రాజమౌళి 'బాహుబలి-2' షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదల కానుంది.
Happy birthday to one of my fav n m sure the nations fav director @ssrajamouli !! You are such an inspiration sir. Have a great year!
— Rakul Preet (@Rakulpreet) 10 October 2016