ఐఐటీ గువాహటిలో మొదటి సెమిస్టర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ నాలుగో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఐఐటీ గువాహటిలో మొదటి సెమిస్టర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ నాలుగో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్గావ్ ప్రాంతానికి చెందిన తుషార్ యాదవ్ అనే ఈ విద్యార్థి తాను తీవ్ర డిప్రెషన్కు లోనైనట్లు తన సూసైడ్ నోట్లో రాసినా, ర్యాగింగ్ వల్లే అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తుషార్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
అయితే, ఐఐటీ అధికారవర్గాలు మాత్రం తుషార్ ర్యాగింగ్కు గురికాలేదని అంటున్నారు. ఆత్మహత్య చేసుకోడానికి కొన్ని గంటల ముందు తుషార్ తన తల్లితో మాట్లాడాడని, అప్పుడు అతడు సాధారణంగానే కనిపించాడని కుటుంబ సభ్యులు చెప్పారు. ముందురోజు రాత్రి తుషార్ తన హాస్టల్ గదిలో లేడన్న విషయాన్ని తాము కనుగొన్నట్లు ఐఐటీ గువాహటి పీఆర్వో లబను కొన్వర్ తెలిపారు. గత మార్చి నెలలో కూడా ఎంఎస్సీ చదువుతున్న ఓ బెంగాలీ విద్యార్థి ఉరేసుకుని ఇదే ఐఐటీలో ఆత్మహత్య చేసుకున్నాడు.