ఆర్బీఐ గవర్నర్ ఎంపిక నేడే? | Government could take call on Raghuram Rajan's successor today | Sakshi
Sakshi News home page

ఆర్బీఐ గవర్నర్ ఎంపిక నేడే?

Aug 18 2016 1:10 PM | Updated on Sep 4 2017 9:50 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎంపికపై గురువారం సాయంత్రం సమావేశం కానున్నారు.

న్యూఢిల్లీ:  గత కొంతకాలంగా ఆసక్తికర చర్చకు  దారితీసిన  ఆర్బీఐ గవర్నర్ పదవిని అలంకరించే అభ్యర్థి ఎంపిక పై కేంద్ర ప్రభుత్వం నేడు (గురువారం)  ఓ నిర్ణయం తీసుకోనుంది.   ఈ మేరకు  ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ  ఈ సాయంత్రం సమావేశం కానున్నారు.  దీంతో కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎంపికపై గురువారం ఒక ప్రకటన  వెలువడనుందని తెలుస్తోంది.   


కాగా  ప్రస్తుత  గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీ కాలం ఈ సెప్టెంబర్ 4 తో ముగియనుంది.  రెండవసారి గవర్నర్ పదవిని చేపట్టబోననని రాజన్ స్పష్టం చేయడంతో ఈ పదవి ఎవర్ని వరించనుందనే అంశంపై పలు అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఆర్ బీఐ గవర్నర్ సుబీర్ గోకర్న్,   డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్,  ఎస్ బీఐ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య తదితర  పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్న  సంగతి తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement