గూగుల్‌ మరో ఇంట్రెస్టింగ్‌ యాప్‌ | Google ventures into food ordering, home services with Areo app | Sakshi
Sakshi News home page

గూగుల్‌ మరో ఇంట్రెస్టింగ్‌ యాప్‌

Apr 13 2017 8:24 PM | Updated on Oct 4 2018 5:10 PM

సెర్చ్‌ ఇంజీన్‌ దిగ్గజం గూగుల్‌ మరో సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

సెర్చ్‌ ఇంజీన్‌ దిగ్గజం గూగుల్‌ మరో సరికొత్త  యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  తాజా యాప్‌ తో  ఫూడ్‌ అండ్‌ బుక్‌ సేవల్లోకి ఎంట్రీ ఇచ్చింది  ఈ టెక్ దిగ్గజం.  ‘ఏరియో’ పేరుతో విడుదల చేసిన ఈ యాప్ ద్వారా  అదిరిపోయే    ఎన్నో స‌దుపాయాలు యూజ‌ర్లకు అందిస్తోంది.  గూగుల్‌ ప్లే నుంచి ఈ  యాప్‌ను ఉచితంగా డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు.  అలాగే హోం  సర్వీసులకోసం అర‍్బన్‌ క్లాప్‌ , జింబర్‌ తో నూ,  ఆహార సేవలకోసం ఫ్రెష్‌  మెనూ, బాక్స్‌ 8 లాంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అలాగే  చెల్లింపులకోసం ఆన్‌లైన్‌ పేమెంట్స్‌  కంపెనీ  డైరెక్‌ పే తో  ఒప్పందం కుదుర్చుకుంది.
 
ముంబై, బెంగళూరులలో ఇప్పటికే అందుబాటులో ఉంది.  ఈ యాప్‌ ద్వారా ఏరియో యాప్ ద్వారా హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి ఆహార పదార్థాలను ఆర్డర్‌ చేసుకోవచ్చు.  అంతేకాదు శాఖాహారం,  మాంసాహార ఆహార ఎంపికలు కోసం ఫిల్టర్ ఆప్షన్‌ కూడా ఉంది.  దీంతోపాటు బిల్లుల‌ చెల్లింపులు, ప్లంబర్‌, బ్యుటీషియన్‌ వంటి సేవ‌ల‌ను పొందవ‌చ్చు. అన్ని స‌ర్వీస్‌లు ఏరియా యాప్‌లో ఒకే చోట ఉండ‌డంతో యూజ‌ర్ల‌కు మ‌రింత సౌల‌భ్యంగా ఉండనుందని భావిస్తున్నారు.   యూజర్ల  లోకేషన్‌ను ఆధారంగా  ఆర్డ‌రు చేసుకున్న వెంట‌నే వారు కోరుకున్న వ‌స్తువులు, ఆహార ప‌దార్థాల డెలివరీ సదుపాయాన్ని కల్పిస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement