breaking news
Areo app
-
గూగుల్ ఫుడ్ డెలివరీ యాప్.. ఆరియో
► హోమ్ సర్వీసులు కూడా ► ముందుగా ముంబై, బెంగళూరులో కార్యకలాపాలు బెంగళూరు: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తాజాగా భారత్‌లో ఫుడ్ డెలివరీ, హోమ్ సర్వీసెస్‌కి సంబంధించి ఆరియో యాప్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ముంబై, బెంగళూరులో యాప్ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఫుడ్ డెలివరీ సేవల కోసం బాక్స్8, ఫ్రెష్‌మెను, ఫాసూస్ వంటి సంస్థలతోను, గృహ సంబంధ సర్వీసుల కోసం అర్బన్‌క్లాప్, జింబర్ సంస్థలతోనూ ఒప్పందాలు కుదుర్చుకుంది. దాదాపు 8–10 నెలలుగా ఈ తరహా ఒప్పందాలు కుదుర్చుకోవడంపై గూగుల్ దృష్టి పెట్టినట్లు సమాచారం. మూడు నెలల క్రితమే తమ ఉద్యోగుల కోసం పైలట్ ప్రాజెక్టు కూడా ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్‌లో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో.. ఆరియోను అందుబాటులోకి తెచ్చినట్లు గూగుల్ తెలిపింది. ఆరియో ద్వారా వినియోగదారులు, స్టార్టప్ సంస్థల మధ్య అనుసంధానకర్తగా గూగుల్ వ్యవహరిస్తుంది తప్ప ఈ సేవల కోసం ప్రత్యేకంగా తమ సిబ్బందిని వినియోగించదు. ఆయా స్టార్టప్ సంస్థలే సర్వీసులు అందించాల్సి ఉంటుంది. అయితే అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నందున గూగుల్ కొంత కమీషన్ తీసుకుంటుంది. ఇప్పటికిప్పుడు పెద్దగా పోటీదారు కానప్పటికీ.. రాబోయే రోజుల్లో కార్యకలాపాలు విస్తరించిన పక్షంలో జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ సేవల సంస్థలపై ఆరియో ప్రభావం పడొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశీ స్టార్టప్ సంస్థల్లోకి నిధుల ప్రవాహం తగ్గిపోయిన తరుణంలో గూగుల్ ప్రవేశం ప్రాధాన్యం సంతరించుకుంది. -
గూగుల్ మరో ఇంట్రెస్టింగ్ యాప్
సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ మరో సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజా యాప్ తో ఫూడ్ అండ్ బుక్ సేవల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ టెక్ దిగ్గజం. ‘ఏరియో’ పేరుతో విడుదల చేసిన ఈ యాప్ ద్వారా అదిరిపోయే ఎన్నో సదుపాయాలు యూజర్లకు అందిస్తోంది. గూగుల్ ప్లే నుంచి ఈ యాప్‌ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే హోం సర్వీసులకోసం అర్బన్ క్లాప్ , జింబర్ తో నూ, ఆహార సేవలకోసం ఫ్రెష్ మెనూ, బాక్స్ 8 లాంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అలాగే చెల్లింపులకోసం ఆన్లైన్ పేమెంట్స్ కంపెనీ డైరెక్ పే తో ఒప్పందం కుదుర్చుకుంది. ముంబై, బెంగళూరులలో ఇప్పటికే అందుబాటులో ఉంది. ఈ యాప్ ద్వారా ఏరియో యాప్ ద్వారా హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి ఆహార పదార్థాలను ఆర్డర్ చేసుకోవచ్చు. అంతేకాదు శాఖాహారం, మాంసాహార ఆహార ఎంపికలు కోసం ఫిల్టర్ ఆప్షన్ కూడా ఉంది. దీంతోపాటు బిల్లుల చెల్లింపులు, ప్లంబర్, బ్యుటీషియన్ వంటి సేవలను పొందవచ్చు. అన్ని సర్వీస్‌లు ఏరియా యాప్‌లో ఒకే చోట ఉండడంతో యూజర్లకు మరింత సౌలభ్యంగా ఉండనుందని భావిస్తున్నారు. యూజర్ల లోకేషన్‌ను ఆధారంగా ఆర్డరు చేసుకున్న వెంటనే వారు కోరుకున్న వస్తువులు, ఆహార పదార్థాల డెలివరీ సదుపాయాన్ని కల్పిస్తుంది.