ఆ ఫోన్పై రూ.7,000 డిస్కౌంట్! | Sakshi
Sakshi News home page

ఆ ఫోన్పై రూ.7,000 డిస్కౌంట్!

Published Tue, Nov 22 2016 3:35 PM

ఆ ఫోన్పై రూ.7,000 డిస్కౌంట్!

న్యూఢిల్లీ : గూగుల్ తన సొంత బ్రాండులో తాజాగా లాంచ్ చేసిన పిక్సెల్ స్మార్ట్ఫోన్ను కొనుగోలుచేయాలని ఉందా? అయితే ఇదే సరియైన సమయమట. ఈ ఫోన్ కొనుగోలుపై కంపెనీ రూ.7,000 డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది.  హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు హోల్డర్స్కు ఈ డిస్కౌంట్ ఆఫర్ నవంబర్ 30 వరకు అందుబాటులో ఉండనున్నట్టు కంపెనీ చెప్పింది. యాక్సిస్ బ్యాంకు కార్డు వినియోగదారులకు కూడా రూ.5,000 క్యాష్బ్యాక్ను కంపెనీ అందించనుంది. వీటితో ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో గూగుల్ స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసేవారికి మరో ఆకర్షణీయమైన ఆఫర్ను గూగుల్ ప్రకటించింది. వెబ్సైట్లో ఈ ఫోన్పై రూ.26,000వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ను  అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. అక్టోబర్ 13న గూగుల్ పిక్సెల్ బ్రాండులో రెండు స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. వీటి ప్రారంభ ధర రూ.57,000గా ఉంది. ఆపిల్కు పోటీగా గూగుల్ ఈ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 
 
పిక్సెల్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు...
5 అంగుళాల ఫుల్ హెచ్డీ రిజుల్యూషన్ అమోలెడ్ డిస్ప్లే
2770 ఎంఏహెచ్ బ్యాటరీ
8 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
12.3 ఎంపీ రియర్ కెమెరా
4జీబీ ర్యామ్
32 జీబీ, 128 జీబీ ఇంటర్నెట్ స్టోరేజ్ ఆప్షన్స్
1.6 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.1 నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్

Advertisement
 
Advertisement
 
Advertisement