వార్నర్‌.. గంగూలీ ఇంటికి వెళ్లు..! | Go to Sourav Ganguly house, fans tell David Warner | Sakshi
Sakshi News home page

వార్నర్‌.. గంగూలీ ఇంటికి వెళ్లు..!

Sep 21 2017 10:10 AM | Updated on Sep 22 2017 10:02 AM

వార్నర్‌.. గంగూలీ ఇంటికి వెళ్లు..!

వార్నర్‌.. గంగూలీ ఇంటికి వెళ్లు..!

భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో తొలి వన్డేకు, రెండో వన్డేకు మధ్య నాలుగు రోజుల గడువు దొరికింది.

భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో తొలి వన్డేకు, రెండో వన్డేకు మధ్య నాలుగు రోజుల గడువు దొరికింది. దీంతో సహజంగానే ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులతో రిలాక్స్‌ అవ్వడానికి టైం దొరికినట్టయింది.

ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఓ ఆసక్తికరమైన పోస్టును పెట్టాడు. కుటుంబసభ్యులతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి.. కోల్‌కతాలో సందర్శించడానికి గల ఉత్తమ ప్రదేశాలు ఏవంటూ నెటిజన్లను అడిగాడు. దీంతో ఆయనకు ఆసక్తికరమైన సమాధానాలు వచ్చాయి. దీంతో చాలామంది అభిమానులు .. గంగూలీ ఇంటిని సందర్శించమంటూ వార్నర్‌కు సూచించారు. 'కోల్‌కతా ప్రిన్స్‌'గా పేరొందిన గంగూలీ ఇంటిలో ఆతిథ్యం బాగుంటుందని పేర్కొన్నారు. ఇక, కోల్‌కతాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు హౌరాబ్రిడ్జి, శాంతినికేతన్‌, విక్టోరియా మెమోరియల్‌ తదితర ప్రాంతాలను సందర్శించాలని పలువురు నెటిజన్లు సూచించారు. ఇక బెంగాల్‌లో దుర్గా నవరాత్రి ఉత్సవం అతిపెద్ద పండుగ. కాబట్టి దుర్గామత మండపాలను సందర్శించాలని మరికొందరు నెటిజన్లు సూచించారు.

తొలి వన్డేలో విజయం సాధించిన భారత్‌.. గురువారం కోల్‌కతాలో జరగనున్న రెండో వన్డేకు రెట్టించిన ఉత్సాహం సిద్ధమైంది. అటు ఆసీస్‌ కూడా గెలుపు కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement