యువతిపై ఆర్మీ ఉన్నతాధికారి అత్యాచారం! | Girl raped by army lieutenant | Sakshi
Sakshi News home page

యువతిపై ఆర్మీ ఉన్నతాధికారి అత్యాచారం!

Dec 12 2013 1:01 PM | Updated on Sep 2 2017 1:32 AM

క్రమశిక్షణకు మారు పేరు భారతీయ ఆర్మీ. ఆ ఆర్మీ రంగానికి చెందిన ఉన్నతాధికారి ఓ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది.

క్రమశిక్షణకు మారు పేరు భారతీయ ఆర్మీ. ఆ ఆర్మీ రంగానికి చెందిన ఉన్నతాధికారి ఓ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం...రోహిత్ శర్మ (29) ఆర్మీలో లెఫ్టినెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆర్మీ కళాశాలలో ఉపాధ్యాయురాలి ఉద్యోగం ఇప్పిస్తానని 24 ఏళ్ల యువతికి మాయ మాటలు చెప్పాడు. ఆ విషయంపై చర్చించేందుకు హోటల్ రూమ్ అనువైన వేదిక అని ఆ యువతికి వెల్లడించాడు.

 

హోటల్కు వెళ్లిన యువతిపై రోహిత్ అత్యాచారం జరిపాడు. దాంతో ఆ యువతి జరిగిన విషయాన్నితల్లీ తండ్రులకు వివరించింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.అత్యాచారానికి గురైన యువతికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు. యువతి వాంగ్మూలాన్ని రికార్డు చెసినట్లు పోలీసు ఉన్నతాధికారి గురువారం మీరట్ లో వివరించారు. అత్యాచారం విషయమై ఆర్మీ అధికారులను సంప్రదిస్తున్నట్లు చెప్పారు. అయితే ఆ కేసులో ఇంతవరకు లెఫ్టినెంట్ను అరెస్ట్ చేయలేదని పోలీసు ఉన్నతాధికారి వివరించారు.అయితే ఆ ఘటన ఈ ఏడాది ఆక్టోబర్ 22న జరిగిందని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement