ఎస్పీకి ఝలక్‌.. బీజేపీలోకి జంప్‌! | Gaurav Bhatia joins BJP | Sakshi
Sakshi News home page

ఎస్పీకి ఝలక్‌.. బీజేపీలోకి జంప్‌!

Apr 2 2017 8:06 PM | Updated on Mar 29 2019 9:31 PM

ఎస్పీకి ఝలక్‌.. బీజేపీలోకి జంప్‌! - Sakshi

ఎస్పీకి ఝలక్‌.. బీజేపీలోకి జంప్‌!

చాలాకాలంపాటు సమాజ్‌వాదీ పార్టీకి గొంతుకగా టీవీ చర్చలలో ప్రముఖంగా కనిపించిన గౌరవ్‌ భాటియా తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

చాలాకాలంపాటు సమాజ్‌వాదీ పార్టీకి గొంతుకగా టీవీ చర్చలలో ప్రముఖంగా కనిపించిన గౌరవ్‌ భాటియా తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎస్పీ పదవులకు రాజీనామా చేసిన భాటియా ఆదివారం కమలం కండువా కప్పుకున్నారు. ఎస్పీ అధికార ప్రతినిధిగా, ఆ పార్టీ లీగల్‌ వింగ్‌ అధ్యక్షుడిగా గతంలో భాటియా పదవులు నిర్వహించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ పరాజయం పాలై.. అంతర్గత కుటుంబ విభేదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో ఆ పార్టీకి మీడియా ముఖంగా వ్యవహరించిన భాటియా తాజా చర్య ప్రాధాన్యం సంతరించుకుంది.

నిజానికి యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కొంతముందే గత ఫిబ్రవరిలో తాను ఎస్పీకి రాజీనామా చేస్తున్నట్టు భాటియా ఫేస్‌బుక్‌లో ప్రకటించారు. తన ప్రధాన సిద్ధాంతమైన సోషలిజానికి ఎస్పీ దూరం జరిగిందని, అందుకే తాను రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయన బీజేపీలో చేరుతారని గత రెండునెలలుగా ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ ఊహాగానాలను నిజం చేస్తూ ఆయన తాజాగా కమలం గూటికి చేరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement