మళ్లీ బ్యాటు పట్టిన గంగూలీ! | Ganguly injures his shoulder | Sakshi
Sakshi News home page

మళ్లీ బ్యాటు పట్టిన గంగూలీ!

Dec 4 2016 6:52 PM | Updated on Sep 4 2017 9:54 PM

మళ్లీ బ్యాటు పట్టిన గంగూలీ!

మళ్లీ బ్యాటు పట్టిన గంగూలీ!

క్రికెట్‌ నుంచి రిటైరైన బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

కోల్‌కతా: క్రికెట్‌ నుంచి రిటైరయి.. ప్రస్తుతం బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరీ తీరిక దొరికినప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు గంగూలీ ఏం చేస్తాడో తెలుసా? తన చిన్ననాటి జ్ఞాపకాల్లోకి దూరిపోతాడు. సరదాగా బ్యాటు పట్టుకొని గల్లీ క్రికెట్‌ ఆడుతాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి దాదా రిటైరయిపోయి అప్పుడే ఎనిమిదేళ్లు అవుతోంది.

అయినా గంగూలీకి క్రికెట్‌ అంటే మక్కువ తగ్గలేదు. అందుకే ఈడెన్‌ గార్డెన్స్‌లోనే కాదు తీరిక దొరికితే ఉత్తర కోల్‌కతాలోని ఇరుకు సందుల్లోనూ దాదా క్రికెట్‌ ఆడుతూ కనిపిస్తాడు. తాజాగా ఇలాగే గల్లీ క్రికెట్‌ ఆడుతూ గంగూలీ కనిపించాడు. పిల్లలతో కలిసి దాదా ఆడిన ఈ గల్లీ క్రికెట్‌ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. గల్లీ క్రికెట్‌లోనూ గంగూలీ తన ట్రేడ్‌మార్క్‌ షాట్లు కొట్టాడు. ఇంతలో ఓ బాల్‌ దూసుకొచ్చి ఆయన భుజానికి గట్టిగా తాకింది. మామూలు టెన్నిస్‌ బంతి కావడంతో పెద్దగా గాయమేమీ కాలేదు. కాసేపు చేయి రాసుకొని మళ్లీ గంగూలీ క్రికెట్‌ కొనసాగించాడు.

Advertisement
 
Advertisement
Advertisement