ప్రత్యేక హోదా బాబు అడగనే లేదు: గాలి | Gali muddu krishnama naidu comments on ap special status and chandrababu | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా బాబు అడగనే లేదు: గాలి

Sep 13 2016 2:02 AM | Updated on Mar 23 2019 9:10 PM

ప్రత్యేక హోదా బాబు అడగనే లేదు: గాలి - Sakshi

ప్రత్యేక హోదా బాబు అడగనే లేదు: గాలి

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తమ నేత, సీఎం చంద్రబాబు కేంద్రాన్ని ఎన్నడూ అడగనే లేదని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ్మనాయుడు చెన్నైలో వ్యాఖ్యానించారు

సాక్షి, చెన్నై: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తమ నేత, సీఎం చంద్రబాబు కేంద్రాన్ని ఎన్నడూ అడగనే లేదని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ్మనాయుడు చెన్నైలో వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా అన్నది బీజేపీకి సంబంధించిన విషయమని, ఆ నినాదం లేవనెత్తింది కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడేనని చెప్పారు.

హోదాతో ఎలాంటి లాభం లేనప్పుడు ప్రజాభీష్టం మేరకు ఇచ్చేయొచ్చుగా అని ప్రశ్నించారు. పుత్తూరు, నగరి పరిధిలోని రైల్వే స్టేషన్లలో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ చెన్నై దక్షిణ రైల్వే డివిజన ల్ మేనేజర్ అనుపమ్‌శర్మను కలిసి సోమవారం ముద్దుకృష్ణమ వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కొత్త రాజధాని నిర్మాణానికి ఐదు లక్షల కోట్ల నిధి కావాలని కేంద్రాన్ని చంద్రబాబు అప్పట్లో కోరినట్టు తెలిపారు. అయితే ఎప్పుడూ ప్రత్యేక హోదా కావాలని ఆయన అడగలేదని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement