ఐపీఎస్ అధికారి భార్యకూ వేధింపులు!! | four held for teasing IPS officer's wife | Sakshi
Sakshi News home page

ఐపీఎస్ అధికారి భార్యకూ వేధింపులు!!

Mar 13 2014 1:01 PM | Updated on Sep 2 2017 4:40 AM

ఐపీఎస్ అధికారి భార్యను వేధించిన కేసులో ఉత్తరప్రదేశ్లోని హజ్రత్గంజ్ ప్రాంతానికి చెందిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

ఐపీఎస్ అధికారి భార్యను వేధించిన కేసులో ఉత్తరప్రదేశ్లోని హజ్రత్గంజ్ ప్రాంతానికి చెందిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఓ మాల్లో జరిగింది. సీబీసీఐడీలో పనిచేసే సదరు అధికారి భార్య.. షాపింగ్ కోసమని మాల్కు వెళ్లినప్పుడు నలుగురు వ్యక్తులు ఆమె వెంట వెళ్లి, వేధించడం మొదలుపెట్టారు.

దాంతో ఆమె వెంటనే పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేసి తన భర్తకు ఈ విషయం చెప్పారు. ఫోన్ చేసినది తమ ఉన్నతాధికారి భార్య కావడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. అనంతరం మాల్లోని సీసీటీవీ ఫుటేజ్ చూసి.. అకిల్ అహ్మద్, ఇర్షాద్ అహ్మద్, గులాం అలీ, పర్వేజ్ ఆలమ్ అనే నలుగురిని అరెస్టు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement