విమానం కూలి 10 మంది మృతి | Five children among 10 dead in Colombia plane crash | Sakshi
Sakshi News home page

విమానం కూలి 10 మంది మృతి

Dec 4 2014 8:20 AM | Updated on Apr 3 2019 5:51 PM

అమెరికాలోని కొలంబియాలో బుధవారం విమానం కూలిన దుర్ఘటనలో ఐదుగురు చిన్నారులతో సహా 10 మంది మృతి చెందారు.

బొగొటా: అమెరికాలోని కొలంబియాలో బుధవారం విమానం కూలిన దుర్ఘటనలో ఐదుగురు చిన్నారులతో సహా 10 మంది మృతి చెందారు. సాంకేతిక లోపం కారణంగానే విమానం(పైపర్ పీఏ-31 నవజో) కూలిపోయిందని అధికారులు వెల్లడించారు.

సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్లు విమానాన్ని మేరీక్విటా ఎయిర్ పోర్టులో అత్యవసరంగా దించాలని భావించినట్టు కొలంబియా ఏవియేషన్ అధికారి ఒకరు తెలిపారు. దురదుష్టవశాత్తు ఎయిర్ పోర్టుకు 13 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిపోయిందని వెల్లడించారు.

బొగొటా నుంచి బాహియా సోలానోకు వెళుతుండగా విమానం ప్రమాదానికి గురైంది. మృతుల్లో ఇద్దరు పైలట్లు, 8 మంది ప్రయాణికులున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement