లంచగొండి మంత్రిపై ఎఫ్ఐఆర్ | fir registered against Bihar minister Awadhesh Kushwaha | Sakshi
Sakshi News home page

లంచగొండి మంత్రిపై ఎఫ్ఐఆర్

Oct 13 2015 5:20 PM | Updated on Jul 18 2019 2:02 PM

లంచగొండి మంత్రిపై ఎఫ్ఐఆర్ - Sakshi

లంచగొండి మంత్రిపై ఎఫ్ఐఆర్

లంచం తీసుకుంటూ దొరికిపోయిన బిహార్ ఎక్సైజ్ మంత్రి అవధేష్ కుష్వాహపై మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

పట్నా: లంచం తీసుకుంటూ దొరికిపోయిన బిహార్ ఎక్సైజ్ మంత్రి అవధేష్ కుష్వాహపై మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త నుంచి అవధేష్ 4 లక్షల రూపాయలను లంచంగా తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో తీసిన వీడియో దృశ్యాలను యూ ట్యూబ్లో అప్లోడ్ చేశారు.

దీంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చర్యలు తీసుకున్నారు. నితీష్ ఆదేశాల మేరకు అవధేష్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అంతేగాక అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి ఆయన్ను తప్పించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement