దర్శకుడు సుభాష్ కపూర్‌ కు బెయిల్ | Filmmaker Subhash Kapoor gets bail in molestation case | Sakshi
Sakshi News home page

దర్శకుడు సుభాష్ కపూర్‌ కు బెయిల్

Jun 24 2014 4:01 PM | Updated on Apr 3 2019 6:23 PM

దర్శకుడు సుభాష్ కపూర్‌ కు బెయిల్ - Sakshi

దర్శకుడు సుభాష్ కపూర్‌ కు బెయిల్

సినీ నటి గీతికా త్యాగిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన బాలీవుడ్ దర్శకుడు సుభాష్ కపూర్‌ బెయిల్ పై విడుదలయ్యారు.

ముంబై: సినీ నటి గీతికా త్యాగిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన బాలీవుడ్ దర్శకుడు సుభాష్ కపూర్‌ బెయిల్ పై విడుదలయ్యారు. ఆయనను సోమవారం మధ్యాహ్నం ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత ఆయనను అంధేరి కోర్టులో హాజరుపరిచగా, ఆయనకు బెయిల్ మంజూరయిందని వెర్సోవా పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సోమవారం రాత్రే ఆయన జైలు నుంచి విడుదలయ్యారని చెప్పారు.

సుభాష్ అతని సహచరుడు ధనీష్ రాజా 2012 మేలో ముంబై శివారు వెర్సొవాలోని తన నివాసానికి వచ్చి తనతో అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొంటూ సినీ నటి గీతికా త్యాగి గత ఏప్రిల్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్టను దెబ్బ తీసేందుకు సుభాష్ ప్రయత్నించాడని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
కాగా, ధనేష్ రాజా పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. సుభాష్ కపూర్ జాలీ ఎల్‌ఎల్‌బీ సినిమాకు దర్శకత్వం వహించగా.. త్యాగి ఆత్మ, వాట్ ద ఫిష్, వన్ బై టు వంటి సినిమాల్లో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement